Hansika motwani giving philosophies about weight loss

hansika motwani, hansika motwani hot photos, hansika latest news, hansika interview, hansika hot gallery, hansika kollywood, hansika telugu movies

hansika motwani giving philosophies about weight loss

వయసు చేసే మాయాజాలానికి హన్సిక ‘‘ఫ్లాట్’’ అయిందట!

Posted: 09/10/2014 05:18 PM IST
Hansika motwani giving philosophies about weight loss

తక్కువ వయస్సులోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చుకుని ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న హన్సిక.. తన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేక ఆవేశంతో రగిలిపోతోందని చెబుతోంది. చిన్న ప్రాయంలో వున్నప్పుడు ఒకరకంగానూ... 20 సంవత్సరాలు దాటిన తర్వాత అకస్మాత్తుగా కొన్ని మార్పులు పుట్టుకొచ్చేస్తాయంటూ క్లారిటీ ఇస్తోంది ఈ బొద్దుగుమ్మ! వయసు పెరిగేకొద్దీ ప్రతిఒక్కరిలో మార్పులు సహజంగానే వస్తాయని.. బాడీలో వున్న ఎంజైమ్ ల వల్లే అలా మార్పులు సంభవిస్తాయని సైన్స్ పాఠాలు చెబుతోంది అమ్మడు! అయినా హన్సిక సడెన్ గా ఎందుకిలా మాట్లాడుతోందనే కదా మీ సందేహం.. అయితే స్టోరీలోకి వెళ్లాల్సిందే!

ఇటీవలే పాలబుగ్గల సుందరి హన్సిక తాజాగా ఒక మీడియా సమాేశంలో పాల్గొంది. అందులో ఒక కొంటె కుర్రాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. తనకున్న సైన్స్ పరిజ్ఞానంతో పెద్ద క్లాసే పీకిందట ఈ భామ! ‘‘మేడమ్.. ఏంటి మీరు రానురాను చాలా సన్నబడిపోతున్నారు? భోజనాలు చేయడం మానేశారా..? అని సరదాగా అడిగిన ప్రశ్నకు.. ఆ అమ్మడు అతని బుర్ర తినేసింది. ఆ ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘16 ప్రాయంలో వున్నప్పుడు ఏ అమ్మాయి అయినా బొద్దుగానే వుంటుంది. ముద్దొచ్చేలా కనిపిస్తుంది. అప్పుడలా వుండటమే అమ్మాయికి అందం. కానీ 20 దాటిన తర్వాత అకస్మాత్తుగా శారీరక మార్పులొస్తాయి. వున్నట్టుండి బొద్దుగా వున్న అమ్మాయిలూ కాస్త సన్నబడిపోతారు’’ అంటూ పేర్కొంది.

ఈ విషయాన్నే కొంచెం ఘాటుగా పేర్కొంటూ.. ‘‘మనిషిలో ఏ మార్పు వచ్చినా అది వయసు చేసే మాయాజాలమే! వయసు పెరిగే కొద్దీ అందం, ఆకృతిలో మార్పులు వస్తాయి. బాడీలో ఎంజైమ్ లో వచ్చే మార్పుల వల్లే ఇలా సంభవిస్తుంది. ఆ కారణంతోనే నేను కూడా సన్నబడ్డాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ఈమె ఇచ్చిన ఈ క్లాస్ కి క్వశ్చన్ అడిగిన అబ్బాయితోపాటు అక్కడున్న మీడియా ప్రతినిధులందరూ అలాగే చూస్తుండిపోయారని సమాచారం! ఇలావుండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో ఫుల్ బిజీ అయిపోయింది. నెలకొకటి చొప్పున ఈ అమ్మడి సినిమాలు రిలీజ్ కానున్నాయని పేర్కొంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘‘పవర్’’ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hansika motwani  actresses body structure  celebrities interview  tollywood  kollywood  

Other Articles