Samantha wants to quit film industry

samantha, samantha latest news, samantha hot photo shoot, samantha news, samantha magazines, samantha movies, samantha biography, samantha photos

samantha wants to quit film industry in stardom position

ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తున్న సమంత!

Posted: 09/09/2014 11:45 AM IST
Samantha wants to quit film industry

‘‘ఏమాయ చేశావే’’ సినిమాలో జెస్సీగా నటించి, కుర్రకారులను తన వలలో పడేసిన సమంత... అప్పటినుంచి ఇప్పటివరకు వెనుదిరగకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ.. సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా నిలిచిపోయింది. ఎంతమంది సీనియర్ నాయికలు వున్నప్పటికీ.. వారందరినీ తలదన్నేసి ముందుకు దూసుకుపోతోంది ఈ గ్లామర్ డాల్! మొన్నటివరకు గ్లామర్ విషయంలో కాస్త వెనుకంజలో వున్న సమంత.. తనకు ఇందులో ఇతర నాయికల నుంచి పోటీ ఎక్కువవుతోందని భావించి.. అందులోనూ సాధ్యమైనంతవరకు తన అందాలను ప్రదర్శించేసింది. ఎలాగైనా తానే అన్ని పరిశ్రమల్లోనూ నెంబర్ వన్ గా నిలవాలనే భావనతో ఈ అమ్మడు చివరికి బికినీలు వేసి తనలో వున్న మొత్తం గ్లామర్ ను సైతం ఒలకబోయడానికి సిద్ధపడిపోయింది. దీంతో ఈ అమ్మడి హవా సౌత్ ఇండస్ట్రీలో బాగానే కొనసాగుతోంది. అయితే ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీకి స్వస్తి చెప్పడానికి తాను సిద్ధంగా వున్నానంటూ షాకింగ్ న్యూస్ ఇచ్చేసింది.

యంగ్ హీరోలనుంచి సీనియర్ల వరకు అందరితో జతకట్టడానికి ఆసక్తి చూపిన ఈ గ్లామర్ డాల్.. నాయికగా వున్నతస్థాయిలో వుండగానే నటనకు స్వస్తి పలుకుతానంటోంది. ఎందుకంటే.. మార్కెట్ లో తన వ్యాల్యూ పడిపోయిన తర్వాత పరిశ్రమకు గుడ్ బై చెబితే చెడ్డ పేరు వస్తుందని.. అందుకే మంచి నాయికగా వున్నతస్థాయిలో వున్నప్పుడే నటకు, పరిశ్రమకు స్వస్తి చెబుతానని క్లారిటీ ఇచ్చుకుంది. ఇందుకు గల మరిన్ని కారణాల కూడా వున్నాయి. ఈ అమ్మడి సొంత పరిశ్రమ అయిన కోలీవుడ్ లో ఇంతవరకు విజయం దక్కలేదు. భారీ సినిమాల్లో నటించి, అందులో అందాలను ఒలకబోసినా.. ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఇటీవలే అంజాన్ సినిమాలో బికినీ వేసుకుని కనువిందు చేసినా.. ఆమెకు లాభం చేకూరలేదు. టాలీవుడ్ లోలాగే కోలీవుడ్ లో తన హవాను కొనసాగించుకోవాలని ఎంతప్రయత్నించినప్పటికీ.. ఈ అమ్మడికి ఒక్క విజయం కూడా అక్కడ దక్కడం లేదు. దీంతో తనకు కోలీవుడ్ లో ఎక్కడా చెడ్డపేరు వస్తుందేమోనని భయపడుతోంది సమంత!

ప్రస్తుతం పరిశ్రమకు ఎంతోమంది కొత్త కథానాయికలు వస్తున్నారు. అయితే వాళ్లందరూ కొన్ని వ్యక్తిగత, ప్రేమ వ్యవహారాలు, ఇతర కారణాల వల్ల కేవలం రెండుమూడు సినిమాలు మాత్రమే పరిమితమవుతున్నాయి. మరికొంతమంది తారలైతే ప్రేమవ్యవహారంలో పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల గురించి స్పందించిన సమంత.. తాను కూడా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చుకున్నప్పుడు ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చిందని.. అయితే కొందరు తన శ్రేయస్సు కోరడంతో తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపింది. చిత్రపరిశ్రమలో వచ్చే ప్రతిఒక్కరికి ధైర్యం చెప్పేవాళ్లు ఖచ్చితంగా వుండాలని.. అప్పుడే వాళ్లు ధైర్యంతో ముందడుగు వేయగలరని సమంత భావిస్తోంది. సమంత కూడా కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో వున్నప్పుడు సినిమాలకు దూరం అవ్వాలని భావించిన నేపథ్యంలో.. కొందరు తనలో ధైర్యాన్ని కూడగట్టారని తెలిపింది. దీంతో ఈ అమ్మడు మళ్లీ అటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కాకుండా.. స్టార్ హీరోయిన్ గా వున్నతస్థాయిలో వున్నప్పుడే పరిశ్రమకు స్వస్తి చెబితే.. దానికో తృప్తి వుంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు విజయ్ ‘‘కత్తి’’, విక్రమ్ సరసన మరో చిత్రంలో నటిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  tollywood  kollywood  telugu actresses  south indian film industry  

Other Articles