(Image source from: the malayala actress malavika nayar sings her first telugu movie offer with hero nani)
ఇంతవరకు మన టాలీవుడ్ తెరకు పరిచమైన భామలందరూ బయటప్రాంతాల నుంచి వచ్చిన తారలే! ప్రస్తుతం అగ్రస్థానంలో పేరు నమోదు కాజల్ అగర్వాల్, సమంతలతోపాటు చిన్న సినిమాల్లో నటించే దాదాపు అందరూ హీరోయిన్లు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చినవాళ్లే! తమతమ భవిష్యత్ ను తేల్చుకోవడం కోసం వీళ్లందరూ ఎన్నో కష్టాలు, అవస్థలు పడి చివరికి హీరోయిన్లుగా ఎదిగారు! ఇప్పుడు తాజాగా మరో మల్లూ బ్యూటీ మన తెలుగు చిత్రపరిశ్రమలు ఎంట్రీ ఇచ్చుకోబోతోంది. తన హాట్ అందాలను ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా వున్నానంటూ ఇక్కడ తన ఖాతా తెరవడానికి వస్తోంది.
ఇటీవల తమిళంలో ‘‘కూకూ’’ అనే చిత్రంలో నటించిన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయకర్.. ఓ తెలుగు సినిమాకు ఓకే చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. నాని హీరోగా అశ్వినీదత్ తనయ స్వప్నదత్ ‘‘స్వప్న సినిమా’’ బ్యానర్ పై నిర్మించే సినిమాలో మాళవిక కథానాయికగా ఎంపికైంది. మొదట నాని సరసన హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలోనంటూ దాదాపు 15 రోజులవరకు తర్జనభర్జన పడిన యూనిట్.. చివరకు ఈ కేరళకుట్టిని ఓకే చేసినట్లు యూనిట్ మెంబర్లు చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాను శేఖర్ కమ్ముల శిష్యుడు నాగి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఇదిలావుండగా.. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చుకుంటున్న మాళవిక నాయర్... తన నటన ప్రతిభతోపాటు తన మాట్ అందాలతో ప్రేక్షకులను ఆకర్షించడం ఖాయమని ఆ మూవీ యూనిట్ పేర్కొంటోంది. పైగా ఇతవరకు నాని నటించిన సినిమాలన్నింటిలోనూ లిప్ లాక్ సన్నివేశాలు వున్నాయి. ఈ తాజా మూవీలో కూడా చుంబనాల సన్నివేశం వుండొచ్చుననే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more