Police case on ram gopal varma for insulting hindus

City Court Issued Orders to File Case Against Ram Gopal varma, Book case against RGV, Malkajgiri Court Direct to File case on Varma, City Court orders filing of case against varma, Malkajgiri Court Issued Orders to File Case Against Ram Gopal varma, Register case on Ram Gopal Varma

the metropolitan court in Malkajgiri responding to his petition, ordered Kushaiguda police to file a case against director ram Gopal Varma ..

ఆ దేవిలను వర్మ అవమానించాడా ?

Posted: 08/26/2014 10:10 AM IST
Police case on ram gopal varma for insulting hindus

రాంగోపాల్ వర్మ సినిమాలు చూసేవారు తగ్గిపోయారు. కానీ వర్మ మాత్రం ప్రతిరోజు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే వున్నాడు. తన నోటికి పనిచెబుతూ, ఎప్పుడూ ఎవరో ఒకరిపై కామెంట్లు, సెటైర్లు చేస్తూ వార్తల్లోకెక్కేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు వర్మ మాట్లాడిన మాటలను ఎవరూ పట్టించుకోలేదని కానీ తాజాగా వర్మ మాట్లాడిన మాటలు మాత్రం ఆలోచింపజేసేలా వున్నాయి. కానీ ఆ మాటలే ప్రస్తుతం వర్మను చిక్కుల్లో పడేసింది.

దేవుళ్లెవరూ ఇష్టంలేదుకానీ, చాలామందికి దేవతలంటే మాత్రం తెగ ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలైనా మనదేశంలో పేదరికం, చదువురానివాళ్లు వున్నారంటే లక్ష్మీదేవి బ్యాడ్, ఫైనాన్స్ గాడ్ అంటూ పేర్కొన్నారు. సరస్వతీదేవి బ్యాడ్ ఎడ్యుకేషన్ గాడ్ అని, ఐదేళ్ల పరిపాలనలో తమ పనులు సరిగ్గా చేయని ఫైనాన్స్ మినిస్టర్‌ని, ఎడ్యుకేషన్ మినిస్టర్‌ని తిట్టుకునే జనాలు... వందల ఏళ్లుగా తమ పనులు చేయని ఫైనాన్స్ గాడ్‌ని, ఎడ్యుకేషన్ గాడ్‌ని ఎందుకు పూజిస్తారో నాకర్థం కాదంటూ ఆయన ప్రస్తావించిన విషయం తెల్సిందే.

హిందూ దేవతల్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేయాలని మల్కాజ్‌గిరి కోర్టు ఆదేశించింది. కుషాయిగూడకు చెందిన సంజయ్ అనే న్యాయవాది మల్కాజ్‌గిరి పదో మెట్రోపాలిటన్ కోర్టులో వర్మపై ఫిర్యాదు చేశారు. ఓ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కోర్టు, విచారణ చేపట్టి రెండునెలల్లోగా నివేదిక ఇవ్వాలని కుషాయిగూడ పోలీసులను ఆదేశించింది. మరి ఈ విషయంపై వర్మ ఎలా స్పందిస్తాడో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal varma  Police Case  Insulting Hindus  Court Issued Orders  

Other Articles