Audio cds will circulate free who watch the power star movie

power star, tollywood power star, kannada movie power star, power star movie, audio cds, punith rajkumar, kannada hero punith raj kumar, pawan kalya, mahesh babu, punith rajkumar mahesh babu

audio cds will circulate free who watch the power star movie : the power star movie unit members has started a new promotion to get high collection for their movie

పవర్ స్టార్ సినిమా చూస్తే.. సీడీ ఫ్రీ!

Posted: 08/25/2014 07:13 PM IST
Audio cds will circulate free who watch the power star movie

(Image source from: audio cds will circulate free who watch the power star movie)

పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయితే చాలు.. థియేటర్లలో అభిమానులు ఎలా క్యూలు కడుతారో మనందరికీ తెలిసిందే! అటువంటి పవర్ స్టార్ సినిమా చూస్తే ఆ మూవీ సీడీలను ఫ్రీగా ఇస్తామంటే ఎవరైనా వదులుకుంటారా... ఇంకా ఆ మూవీ థియేటర్లకు రాకముందే అందరూ క్యూలో ఎగబడిపోతారు. తాజాగా పవర్ స్టార్ సినిమా ఎవరూ చూసినా... వారికి సీడీలను ఫ్రీగా పంచిపెడతామంటూ దర్శకనిర్మాతలు బహిరంగంగా ప్రకటనలు చేశారు. అయితే ఇక్కడ పవర్ స్టార్ అంటే మన టాలీవుడ్ పవన్ కల్యాణ్ కాదులెండి.. శాండల్ వుడ్ హీరో పునీత్ రాజ్ కుమార్! ఇంకొక విషయం ఏమిటంటే.. ఇక్కడ సీడీలను ఫ్రీగా ఇస్తోంది ఆ మూవీ ఆడియో సాంగ్స్ కి సంబంధించిన సీడీలు!

పునీత్ రాజ్ కుమార్ తాజాగా నటించిన ‘‘పవర్ స్టార్’’ సినిమా ఆగస్టు 28వ తేదీన కర్నాటకలో భారీ అంచనాల మధ్య పెద్దఎత్తున్న రిలీజ్ చేస్తున్నారు. అయితే అభిమానులను థియేటర్లకు రప్పించేందుకు ఆ మూవీ దర్శకనిర్మాతలు వినూత్నమైన కొత్త ప్రచారానికి తెరదీశారు. ఇంతకుముందు ఎన్నడూలేని విధందా తమ సినిమాకు సంబంధించి 5 లక్షల ఆడియో సీడీలను సినిమా చూసిన ప్రేక్షకులకు ఫ్రీగా పంచుతామని ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ కి కన్నడలో మంచి ఫాలోయింగ్ వున్నప్పటికీ... ఎక్కువ కలెక్షన్లు రాబట్టేందుకే వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ఆడియో ఆవిష్కరణకు స్పెషల్ గెస్ట్ మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయి అక్కడి ప్రేక్షకులను చమత్కరించాడు. ఇక పునీత్ రాజ్ కుమార్ తన ప్రతిభతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో అతను కన్నడనాట పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇంతవరకు తాను నటించిన చిత్రాలన్నింటిలో చాలావరకు విజయాలను తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఎక్కువ డబ్బులు ఖర్చుచేసి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని దర్శకనిర్మాతలు, అభిమానులు ఆశిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : power star  pawan kalya  punith rajkumar  mahesh babu  

Other Articles