Ram gopal varma annouced ice cream 3 movie

ram gopal varma, ice cream movies, ice cream movie sequel, ice cream movie news, ice cream 2 first look posters, ice cream 3 movie first look

Ram gopal varma annouced ice cream 3 movie : the controversial director of india ram gopal varma is announed that he is going to make another ice cream movie sequel from september 15

బాబోయ్! ‘‘ఐస్ క్రీమ్ 3’’ కూడా వచ్చేస్తోంది!

Posted: 08/22/2014 04:27 PM IST
Ram gopal varma annouced ice cream 3 movie

రాంగోపాల్ వర్మ... తన వన్ అండ్ ఓన్లీ కాంట్రొవర్షియల్ డైరెక్టర్ ఇన్ ఇండియా! దీనిని ఒక కామెంట్ అని అనుకోవచ్చు లేదా కితాబుగా భావించుకోవచ్చు కానీ.. నేడు భారతదేశం మొత్తం వర్మ గురించి చెప్పుకుంటుంది మాత్రం ఇదే! ఎందుకంటే.. ఆయన ఏ కాన్సెప్ట్ తో సినిమాలను తెరకెక్కిస్తాడో ఏమో తెలియదు కానీ.. ఆయన తీసే ప్రతిఒక్క చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా ఖచ్చితంగా నిలబడిపోతాయి. ఈయన తెరకెక్కించే ప్రతిఒక్క సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత తప్పనిసరిగా కనిపిస్తుంది. ఆ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అన్నది ముఖ్యం కాదు.. ప్రాఫిట్ ని రాబట్టిందా..? లేదా..? అన్న థియరీతో వర్మ ముందుకు కొనసాగుతుంటాడు. ఇంతవరకు ఈయన తీసిన చిత్రాలన్నీ దాదాపు అన్ని ఫ్లాప్ అయినవే కానీ.. నిర్మాతలకు మాత్రం డబ్బుల పంట బాగానే పండించాయి. అదీ రాంగోపాల్ వర్మలో వున్న అసలైన టాలెంట్!

ఎంత ఎక్కువ క్యాస్టింగ్ వుంటే.. అంతే త్వరగా సినిమా షూటింగ్ ముగించేసి నిర్మాతలకు ఖర్చు లేకుండా చేస్తాడు. ఇక పబ్లిసిటీ అంటారా.. వర్మ అన్న పేరు చాలు... ఆటోమెటిక్ ఆ సినిమాకు దేశంమొత్తం మీద పబ్లిసిటీ తన్నుకు వస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల నుంచి సినిమా థియేటర్ కు వచ్చేదాకా ఒక పెద్ద సస్పెన్స్ నే క్రియేట్ చేసి పెట్టేస్తాడు వర్మ! అంతే.. ఆ సస్పెన్స్ ఏంటో అని తెలుసుకోవడానికి జనాలు థియేటర్లకు పరిగెత్తుకుని వస్తారు. ఆ దెబ్బతో నిర్మాతలకు పండగే పండగ! పెట్టిన ఖర్చుతోపాటు కనీసం 10 శాతమైనా లాభం వచ్చేస్తుంది. అంతెందుకు.. ఇటీవలే ఈయన తెరకెక్కించిన ‘‘ఐస్ క్రీమ్’’ సినిమానే తీసుకోండి... తక్కువ క్యాస్టింగ్.. తక్కువ బడ్జెట్.. కానీ ఆదాయం మాత్రం పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు! సినిమా మొదటి షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. రిలీజ్ కు ముందే నిర్మాతకి డబ్బుల వర్షాన్ని కురిపించేసింది! దటీజ్ రాంగోపాల్ వర్మ!

తాను తెరకెక్కించిన ‘‘ఐస్ క్రీమ్’’ మూవీ అప్పట్లో ఎన్ని వివాదాలను రేకెత్తించిందో అందరికీ తెలిసిందే! ఆ వివాదాలతోనే ఆ సినిమాకు బాగా కలెక్షన్లు వచ్చాయి. సినిమా బాగానే కలెక్షన్లు సాధించింది కదా అని.. వర్మ అందరికీ ఓ ఝలక్ ఇచ్చేశాడు. ‘‘ఐస్ క్రీమ్ 2’’ సినిమాను తెరకెక్కిస్తున్నానంటూ అప్పుడే దాని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేశాడు. ఇంకేముంది! ఆ సినిమాకు అప్పుడే బోలెడంత పబ్లిసిటీ వచ్చిపడింది. అంతటితో వర్మ ఆగలేదు.. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నవీన హాట్ ఫోటోషూట్ ను రిలీజ్ చేయించి.. యువకుల్ని రక్తికట్టించి పడేశాడు. దాంతో ఆ ఆమెకు, ఆ ఫోటోలను మాంచి రెస్పాన్స్ వచ్చిపడింది. ఇక నిన్నటికి నిన్న ఆ సినిమాకు సంబంధించి ఒకేసారి 20 ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేసి పడేశాడు. ఈ దెబ్బతో రిలీజ్ కు ముందే ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరిగిపోయాయి. అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ‘‘ఐస్ క్రీమ్ 2’’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. కేవలం ఏడురోజుల్లోనే దీని షూటింగును పూర్తి చేసిపడేశాడు వర్మ! ఇటువంటి ప్రయోగాలు రాంగోపాల్ వర్మకు కొత్తేమీ కాదులెండి. ఈ సినిమాను సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటనలు కూడా జారీ చేసేశారు. అయితే ఇక్కడే వర్మ మరోసారి కుండబద్ధలు కొట్టేశాడు. ‘‘ఐస్ క్రీమ్ 3’’ సినిమాను కూడా ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రారంభిస్తానని ధడేల్ మంటూ అందరి గుండెల్ని బాదేశాడు. ‘‘ఐస్ క్రిమ్ 2’’ సినిమా 20 ఫస్ట్ లుక్ లను విడుదల చేసిన నేపథ్యంలో మాట్లాడిన వర్మ.. తాను సెప్టెంబర్ 15వ తేదీ నుంచే ‘‘ఐస్ క్రీమ్ 3’’ సినిమాను ప్రారంభిస్తానని చెప్పాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సీక్వెల్స్ తీస్తూ అక్కడి ప్రేక్షకులకు చుక్కలు చూపించిన వర్మ... ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల మీద ఇలా సీక్వెల్స్ తీస్తూ తన ప్రతాపాన్ని చూపించేస్తున్నాడన్నమాట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  ice cream movie  telugu movies  controversial directors  

Other Articles