Director rajamouli revealed his old secret that he acted as krishna in a movie

rajamouli, rajamouli latest news, rajamouli as krishna, rajamouli krishna avatar, rajamouli movies, rajamouli twitter, rajamouli interview, rajamouli bahubali, rajamouli filmography

director rajamouli revealed his old secret that he acted as krishna in a movie : Director rajamouli shares a past moment with his fans on social media. He reveals a big secret of his acting skills that he acted in a movie as kid krishna which movie didn't release with some problems

రాజమౌళిలో దాగివున్న ‘‘చిలిపి కృష్ణుడు’’!

Posted: 08/20/2014 03:20 PM IST
Director rajamouli revealed his old secret that he acted as krishna in a movie

తెలుగు చిత్రపరిశ్రమలోనే గర్వించదగ్గ ప్రముఖ దర్శకులందరిలో రాజమౌళి ఒకరు! ఈయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈయన తెరకెక్కించిన సినిమాలన్నీ భారీ విజయాలను సాధించినవే! టాలీవుడ్ లో వున్న దర్శకులందరూ ఒక ఎత్తయితే.. ఈ జక్కన్న మాత్రం మరో ఎత్తు! ఎందుకంటే.. ‘‘మగధీర, ఈగ’’ వంటి సినిమాలను తీసి, టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక దర్శకధీరుడు ఈయనే! కెమెరా వెనకాల వుంటూ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్న ఈ డైరెక్టర్... స్ర్కీన్ పై ఎందరో నటులను గంభీరంగా చూపించడంలో ఈయనకు ఈయనే సాటి! ప్రస్తుతం ‘‘బాహుబలి’’ సినిమాతో మరో చరిత్రను సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు.

ఇదిలావుండగా.. తాజాగా జక్కన్న తనలో దాగివున్న చిలిపి కృష్ణుడిని బయటపెట్టాడు. ఆమధ్య రాజమౌళి ‘‘బాహుబలి’’ సినిమాలో నటిస్తున్నాడనే రూమర్లు బాగానే షికార్లు చేశాయి. కానీ జక్కన్న తాను నటించడంలేదని ఆ గాసిప్స్ ను కొట్టిపారేశాడు. అయితే నటన మీద తనక్కూడా మక్కువ వున్నట్టు చాలారోజుల తర్వాత బయటపెట్టాడు. తాను దర్శకుడు కాకముందు చాలా చిన్న వయస్సులో ముఖానికి మేకప్ వేసుకుని ‘‘చిలిపి కృష్ణుడిగా’’ నటించానని జక్కన్న స్వయంగా పేర్కొన్నాడు. కొన్ని కారణాల రీత్యా విడుదలకు నోచుకోని ఓ సినిమాలో రాజమౌళి నటించినట్లు తెలిపారు.

‘‘నేను నా చిన్న వయస్సులో వున్నప్పుడు ఓ చిలిపి కృష్ణుడి పాత్రలో నటించాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పూర్తి కాకుండానే ఆగిపోయింది’’ అంటూ ఆయన తన గత రహస్యాల గురించి సోషల్ మీడియాలో అభిమానులకు తెలియజేశారు. కృష్ణాష్టమి సందర్భంగా రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు. నటన మీద చాలా ఇష్టం వున్నప్పటికీ.. దర్శకత్వంపై మక్కువ ఎక్కువ పెరగడం వల్ల తాను డైరెక్టర్ గా అవతారం ఎత్తాల్సి వచ్చిందని జక్కన్న స్పష్టం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamouli  rajamouli twitter  krishna avatar  bahubali movie  

Other Articles