Shahrukh khan bunglow gif

shah rukh khan, shahrukh khan latest news, shahrukh khan house, shahrukh khan house mannat, shahrukh khan house mannat court problems, shahrukh khan bunglow, watchdog foundation mumbai, mount mary church mumbai

shah rukh khan house mannat facing court problems : Bollywood baadshah shah rukh khan house again in court problems. Shahrukh built a ramp for vanity van where the people is using a short cut way to go for church. But now they are facing problems to go church from shahrukh's ramp which goes viral in bollywood

మరోసారి కోర్టు వివాదాల్లో షారుఖ్ ఖాన్ నివాసం!

Posted: 08/20/2014 02:49 PM IST
Shahrukh khan bunglow gif

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు వివాదాలు వెంటపడటం సర్వసాధారణం అయిపోయింది. సెలబ్రిటీలతో గొడవపడటం, ఇతరుల మీద కామెడీ జోక్స్ తో విమర్శలు చేయడం వంటి విషయాల మీద షారుఖ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే వుంటాడు. ఆమధ్య సల్మాన్, ఆమీర్ వంటి స్టార్లతో వచ్చిన విభేదాలు బాలీవుడ్ లో ఎంతపెద్ద దుమారాన్ని రేపాయో మనందరికీ తెలిసిందే! అయితే ఇప్పుడు వారందరూ బాగానే కలుసుకుని మాట్లాడుకుంటున్నారు. ఇక షారుఖ్ వ్యక్తిగత జీవిత విషయాలకు వస్తే.. గతంలో ఒకసారి ఇతని ఇల్లు ‘‘మన్నత్’’ కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు మరోసారి కూడా దీని మీద కేసు నమోదైంది.

షారుఖ్ బంగ్లా వెలుపల వున్న రాంప్ నిర్మాణంపై అతని నివాసం చుట్టుపక్కల నివాసం వుండేవారు, వాచ్ డాగ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థవారు కలిసి బాంబే మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు ఫిర్యాదులు చేశారు. షారుఖ్ తన బంగ్లా వెలుపల వున్న రాంప్ ను అక్రమంగా నిర్మించాడని.. సాధ్యమైనంత త్వరలో ఆ నిర్మాణాన్ని తొలగించాలని వారు ఆ ఫిర్యాదులో కోరారు. వారు అందించిన ఆ ఫిర్యాదులను పరిశీలించిన బీఎంసీ చీఫ్ తక్షణమే షారుఖ్, అతని ఇంటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. షారుఖ్ ఈ విషయంపై తగిన రీతిలో స్పందించి ఆ నిర్మాణాన్ని తొలగిస్తే బాగుంటుంది కానీ.. అందుకు నిరాకరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి రావొచ్చంటూ విశ్లేషకులు తెలుపుతున్నారు.

ముంబయిలోని బ్యాండ్ స్టాండ్ వద్ద వున్న పాపులర్ మౌంట్ మేరీ చర్చ్ కు చాలా సమీపంలోనే షారుఖ్ ఖాన్ ‘‘మన్నత్’’ బంగ్లా వుంది. దీనిని షారుఖ్ ఎంతో అద్భుతంగా మలిచాడు. అయితే.. బంగ్లా నుంచి చర్చ కు వెళ్లేందుకు ఓ షార్ట్ కట్ దారి వుంది. కానీ.. దానిని బ్లాక్ చేస్తూ ఖాన్ రాంప్ ను నిర్మించి అక్కడ తాను ఉపయోగించే వానిటీ వాన్ నిలిపి వుంచుతాడు. దీంతో ఆ రోడ్డు బ్లాక్ కావడం వల్ల స్థానికులు చర్చ్ కి వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ తరుణంలోనే దానిని తొలగించాల్సిందిగా వారు ఫిర్యాదు చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles