Manorama family split into two over her property issue

manorama, actresss, veteran actress, manorama movies, manorama wiki, telugu news, chennai, malayala manorama, manorama family, tollywood news, latest updates

manorama grand daughter filed pitition on court for her property share : manorama family split for her property

మనోరమ ఆస్తి కోసం మనవరాలి పాట్లు

Posted: 08/18/2014 06:10 PM IST
Manorama family split into two over her property issue

అడ్డాల నాడు ఉన్న ప్రేమలు గడ్డాల నాడు ఉండవంటారు. తల్లితండ్రులపై పిల్లలకు చిన్నపుడు ఉన్న ప్రేమ వారు పెరిగి పెద్దయ్యాక ఉండదు. కడుపున పుట్టినవారికే ఇలా ఉంటే వారి తర్వాతి తరం వారికి ఇంకేం చెప్పాలి. బామ్మ, తాతయ్య అంటే మనవలు, మనవరాళ్ళకు కేవలం అవసరాలు తీర్చే మెషిన్లుగా.., ఆ తర్వాత పనికిరాని వారిగా కన్పిస్తున్నారు. నటి మనోరమ ఆస్తిపై ఆమె కుటుంబంలో వివాదం నడుస్తోంది. చివరికిది కోర్టు దాకా వచ్చింది. ఆస్తిపై కుటుంబ సభ్యులు ఏకంగా విడిపోయారు. వెయ్యికి పైగా సినిమాల్లో అనేక పాత్రల్లో నటించిన మనోరమ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో నటించిన డబ్బుతో ఆమె చెన్నై, తిరువళ్ళూరు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం మనోరమ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. బామ్మను కాపాడుకోవటం పక్కన బెట్టి ఆస్తికోసం మనవడు, మనవరాలు తగువుకు దిగారు.

మనోరమ మనవరాలు అభిరామి చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన బామ్మ ఆరోగ్యం క్షీణించిందనీ.., చుట్టు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని స్థితిలో ఆమె ఉందని పిటిషన్లో వెల్లడించింది. అటు తన తండ్రి భూపతి కూడా మద్యానికి బానిసై మతిస్థిమితం లేకుండా ఉన్నారని తెలిపింది. కుటుంబ సభ్యుల ఆనారోగ్యంను సాకుగా చూపి తన అన్న రాజరాజన్. మనోరమ ఆస్తులను ఆయన పేరుకు మార్చుకున్నాడని ఆరోపించింది. బామ్మపై మవరాలికి బాగానే ప్రేమ ఉందనుకుంటే పొరపాటే. అభిరామి పిటిషన్ దాఖలు చేసింది ఆస్తిలో వాటా కోసం తప్ప.., ఆస్తిని కాపాడాలని కాదు. తన అన్న ఆస్తిని విక్రయించటానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. బామ్మ ఆస్తిల తనకు కూడా సగభాగం వాటా వస్తుందని కోర్టుకు తెలిపింది. రాజన్ చర్యల వల్ల తనకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ పిటిషన్ పరిశీలించిన న్యాయమూర్తి మనోరమ కోడలు ధనలక్ష్మి, ఆమె మనవడు రాజరాజన్ ఈనెల 22లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ లోపు బామ్మ ఆస్తి పూర్తిగా తనది అనేందుకు రాజరాజన్ ఆధారాలు సేకరించుకోవటంలో బిజీగా ఉన్నాడు. ఆరోగ్యం క్షీణించిన మనోరమకు సేవలు చేయాల్సింది పోయి.., ఆమె ఆస్తి కోసం అన్నా చెల్లెల్లు కొట్టు కోవటంపై బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో పెద్దరికం పాత్రలు వేసిన మనోరమకు నిజ జీవితంలో మాత్రం ఆ పెద్దరికం ఎక్కువ కాలం లేదని చెప్తున్నారు. బామ్మపై కంటే ఆమె ఆస్తిపైనే ప్రేమను చూపిస్తున్న ఈ మనవడు, మవనరాలు వారి కన్న తల్లితండ్రులనైనా చూసుకుంటారా.. లేక వారు తమకేమిచ్చారని వదిలేస్తారా?

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manorama  property issue  tollywood news  latest updates  

Other Articles