Balakrishna statement on his 100th movie

balakrishna, balakrishna wiki, balakrishna movies list, balakrishna 100th movie, nandamuri fans, nandamuri family, ntr, junior ntr, chandrababu naidu, mla, hindupuram, latest news, tollywood news

balakrishna says more expectations on his 100th movie : every movie have its own expectations recent accident is small issue says balakrishna

వందో సినిమా ఆషామాషిగా ఉండదు

Posted: 08/18/2014 12:28 PM IST
Balakrishna statement on his 100th movie

తన వందవ సినిమాపై బాలకృష్ణ ప్రకటన చేశారు. ఈ సినిమాపై నందమూరి అభిమానులకు ఉన్న అంచనాలను మరింత పెంచుతూ ఇవాళ ఆయన స్పందించారు. వందవ సినిమా అంటే అంత ఆషామాషిగా ఉండదన్నారు. ఇదివరకటి సినిమాలను మించేలా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఈ మద్య ఓ సినిమా షూటింగ్ లో గాయపడ్డ బాలకృష్ణ ప్రమాదం తర్వాత తొలిసారి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా సెంచరీ ఎప్పుడు కొడుతున్నారని మీడియా మిత్రులు అడిగారు. దీనికి బాలయ్యబాబు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. అబిమానుల అంచనాలతో పాటు.., వందో సినిమా కావటతో దీనిపై అంచనాలు మరింత పెరగాయన్నారు.

గాయం మధుర జ్ఞాపకం !!

ఇక తన కాలిగాయంపై కూడా బాలకృష్ణ సమాధానం ఇచ్చారు. ఈ మద్య తన సినిమా షూటింగ్ లో బైక్ నడుపుతుండగా ప్రమాదం జరిగిందన్నారు. తనకు తగిలిన గాయానికి 7 కుట్లు పడ్డాయన్నారు. అయితే ప్రమాదమేమి లేదని.., ప్రస్తుతం ఇది తగ్గిపోయిందని చెప్పారు. అభిమానులెవరూ తన ఆరోగ్యంపై దిగులు చెందవద్దన్నారు. ప్రతి సినిమాకు ఒక్కో గాయం గుర్తుగా మిగిలిపోతుందని.., గాయం ఓ మధుర జ్ఞాపకం అనే సినిమా డైలాగ్ గుర్తు చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తన సినిమా వస్తుందని చెప్పారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  100th movie tollywood news  nandamuri family  

Other Articles