Sachin tendulkar and anushka inaugurates pvp square vijayawada

sachin tendulkar with anushka shetty, sachin and anushka in vijayawada, sachin anushka opens pvp square shopping mall, sachin anushka inaugurates shopping mall, sachin anushka photos, sachin inaugurates pvp square shopping mall, pvp square shopping mall in vijayawada, pvp prasad latest news, anushka shetty latest news, anushka shetty at pvp square, sachin tendulkar at pvp square mall

Sachin and anushka inaugurates pvp square : Master blaster sachin tendulkar and tollywood actress anushka shetty inaugurates pvp square shopping mall in vijayawada which is largest in south india

సచిన్ ఓపెన్ చేస్తే.. అనుష్క కేకలు వేసింది!

Posted: 08/01/2014 07:44 PM IST
Sachin tendulkar and anushka inaugurates pvp square vijayawada

(Image source from: sachin tendulkar and anushka inaugurates pvp square vijayawada)

చివరికి భారత్ క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓపెన్ చేసేశాడు. ఈయన ఓపెన్ చేయడమే ఆలస్యం... టాలీవుడ్ బొమ్మాళి అనుష్క ఎగిరి గంతులేస్తూ కేకలు వేసింది. వీరిద్దరూ చేసిన ఈ రాద్ధాంతాన్ని చూసి.. చుట్టూ వున్న జనాలు కూడా సంబరపడిపోయారు. వీరి ఫోటోలను కెమెరాల్లోకి ఎక్కిస్తూ, ఫోటోలు తీసుకున్నారు. ఒకేచోట ఇద్దరు కలిసి చేసిన సందడిని చూసి అభిమానులు కూడా మురిసిపోయారు. ఈ మేటర్ చదవి కంగారు పడకండి.. అసలు విషయానికి వచ్చేద్దాం!

భారతదేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్స్ లో ఒకటైన పీవీపీ స్క్వర్ ప్రారంభోత్సవానికి సచిన్, అనుష్కలు ఇద్దరూ కలిసి హాజరు అవుతారన్న వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ శుక్రవారం నాడు విజయవాడలో ఆ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ గా చెప్పబడుతున్న ఈ పీవీపీ స్క్వేర్ర ను దాదాపు 125 కోట్లతో ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత పీవీపీ ప్రసాద్ నిర్మించారు. కొన్ని ప్రముఖ వ్యాపారాల్లో సన్నిహిత బంధాలు వుండటంతోనే సచిన్ ఈ కార్యక్రమానికి హాజరయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి సచిన్, అనుష్క, రాఘవేంద్రరావులతోపాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయినట్టు సమాచారం!

sachin-and-anushka-at-pvp-square-shopping-mall

ఈ వేడుకకు విచ్చేసిన సచిన్.. మాల్ ను ఓపెనింగ్ చేయగా.. చుట్టూ వున్న అనుష్కతోపాటు అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సచిన్ ఈ మాల్ ను ఓపెన్ చేస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు.. అక్కడికి విచ్చేసి తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించుకునేందుకు పోటీపడ్డారు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... తొలిసారిగా సచిన్ ‘‘సోదరీ సోదరీమణులారా’’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ తో కలిసి ఇలా వేడుకకు హాజరు కావడం ఎంతో సంతోషంగా వుందంటూ అనుష్క ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin tendulkar  anushka shetty  pvp square mall  vijayawada shopping malls  

Other Articles