Prince mahesh babu completed 15 years career in tollywood film industry

prince mahesh babu latest news, mahesh babu latest news, mahesh babu latest photo shoot, mahesh babu latest movie news, mahesh babu biography in telugu, mahesh babu completed 15 years in tollywood, mahesh babu agadu movie news, mahesh babu history in tollywood, mahesh babu story in tollywood

prince mahesh babu completed 15 years career in tollywood film industry

15ఏళ్ల వరకు టాలీవుడ్ ను కుళ్లబొడిచిన హీరో!

Posted: 07/31/2014 11:54 AM IST
Prince mahesh babu completed 15 years career in tollywood film industry

(Image source from: prince mahesh babu completed 15 years career in tollywood film industry)

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఒక హీరో 15 సంవత్సరాలవరకు తన రాజ్యాన్ని ఏలుకున్నాడు. మన తెలుగుతెరకు చాలామంది హీరోలు పరిచయమయినప్పటికీ.. ఈ యువహీరో మాత్రం తనదైన నటనశైలితో యావత్తు టాలీవుడ్ పరిశ్రమనే ధడధడలాడించేశాడు. గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టించుకుంటూ.. తానే బద్దలుకొట్టుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ‘‘పోకిరి’’ చేష్టలు చేస్తూ.. ‘‘దూకుడు’’గా వ్యవహరిస్తున్న ఈ హీరోను చూసి, ఇతర హీరోలు సైతం శెభాష్ అని పొగిడేస్తున్నారు. తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో ‘‘ప్రిన్స్’’ అనే పేరు సంపాదించి, నేడు సంచలన రికార్డులను సృష్టించే ‘‘సూపర్ స్టార్’’గా ఎదిగిపోయాడు. ఆ హీరో మరెవరో కాదు... సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు!

ప్రిన్స్ మహేష్ బాబు తెలుగుతెరకు పరిచయమై ఇప్పటికీ 15 సంవత్సరాలు అయింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో డెబ్యూ హీరోగా ‘‘రాజకుమారుడు’’ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ‘‘ప్రిన్స్’’గా పేరు సంపాదించుకున్న ఈ యువనటుడు... ఆ తరువాతే అతనిని ఆ పేరుతోనే తలుచుకోవడం పరపాటిగా మారిపోయింది. ఆ సినిమాతోనే అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచిపోయాడు మహేష్. ఆ విధంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈ ‘‘పోకిరి’’... తన ‘‘దూకుడు’’తో టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసి నేడు ‘‘సూపర్ స్టార్’’గా ఎదిగిపోయాడు. ఇతని నడక, నడత, మాట తీరు, వేసే పంచ్ డైలాగులకు ఈయనకు ఈయనే సాటి! ప్రస్తుతం టాలీవుడ్ లో వున్న ప్రేక్షకజనాలను ఈయనంటే ఒక విపరీతమైన క్రేజ్!

మహేష్ బాబు సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోందన్న విషయం తెలియగానే షోకు రెండ్రోజుల ముందే జనాలు క్యూకట్టి మరీ వెయిట్ చేస్తుంటారు. తన ‘‘పోకిరి’’ అలవాట్లతో టాలీవుడ్ బాక్సాఫీస్ ని మొట్టమొదటిసారిగా హయ్యెస్ట్ కలెక్షన్లతో బద్దలుకొట్టిన హీరో ఇతడే! 1999వ సంవత్సరంలో ‘‘రాకుమారుడు’’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్.. 2015 జూలై 30వ తేదీనాటిని మొత్తం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అప్పటి నుంచి నటించిన ప్రతిచిత్రంలోనూ మంచి మార్కులు వేసుకుంటూ.. కొన్ని వేలమైళ్ల ప్రయాణం సాగిస్తూనే వున్నాడు మహేష్! సరికొత్త పంథాతో కథల్ని, పాత్రల్ని ఎంచుకోవడంలో ప్రిన్స్ ఎప్పటికీ ముందుంటాడు. ఆ తరహాలోనే ‘‘నేనొక్కడినే’’ చిత్రం వచ్చింది కానీ తెలుగుప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఏదేమైనా... ప్రస్తుతం టాలీవుడ్ కి పరిచయమై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో మహేష్ కి అభినందనలు చెప్పుకుంటోంది ‘‘తెలుగు విశేష్’’!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles