Tapsee wearing bikini dresses in bollywood and kollywood

tapsee getting offers by wearing bikini dresses in bollywood and kollywood, tapsee latest news, tapsee pannu latest news, tapsee pannu news, tapsee pannu bikini photo shoot, tapsee hot photo shoot, tapsee in baby movie, tapsee with akshay kumar in baby movie, tapsee pannu hot news, tapsee pannu hot stills, tapsee pannu get offer with bikini

tapsee getting offers by wearing bikini dresses in bollywood and kollywood

తాప్సీ కెరీర్ ని మార్చేసిన ‘‘బికినీ’’!

Posted: 07/30/2014 04:17 PM IST
Tapsee wearing bikini dresses in bollywood and kollywood

ఆమధ్య విక్టరీ వెంకటేష్, తాప్సీ జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ‘‘షాడో’’ మూవీ గురించి అందరికీ తెలిసే వుంటుంది. ఆ సినిమా విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే భారీ ఫ్లాప్ అయితే... తాప్సీ పన్నుకి మాత్రం బాగానే కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఆ సినిమాలో ఈ పంజాబీ అమ్మడు బికినీ వేసుకుని తెలుగు ప్రేక్షకులను మత్తెక్కించేలా చేసింది. పైగా తాప్సీ ఆ బికినీలో బాగా సెట్ అయ్యిందని, ఆమె ఫిగర్ కు తగ్గట్టు అందులో బాగానే కనిపించిందని సినీవిశ్లేషకులతోపాటు ప్రేక్షకజనాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దాంతో ఈమెకు సినిమాల్లో ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. కానీ వరుసగా పరాజయాలు చవిచూడటం వల్ల ఈ అమ్మాయి కెరీర్ గాడిలో పడిపోయిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అవకాశాలు కూడా పూర్తిగా కరువయిపోయాయి.

ఈ తరుణంలోనే తాప్సీ తన కెరీర్ ను మలుచుకోవడం కోసం ముంబయికి మకాం మార్చుకుంది. అక్కడికి వెళ్లగానే ఈ అమ్మడు అదృష్టంకొద్ది బాలీవుడ్ యాక్షన్ హీరో అయిన అక్షయ్ కుమార్ సరసన ‘‘బేబీ’’ అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించే ఛాన్స్ కూడా లభించింది. అయితే ఒక్క సినిమాతోనే కెరీర్ ని మలుచుకోవడం సాధ్యంకాదు కాబట్టి.. మరిన్ని ఆపర్లను చేజిక్కించుకోవడం కోసం తనదైన శైలిలో ఈ అమ్మడు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. వీలు దొరికినప్పుడల్లా బాలీవుడ్ లో దర్శకనిర్మాతల చుట్టూ చక్కర్లు కొడుతూ కాలం గడుపుతోంది. అంతేకాకుండా... తన హాట్ అందాలు కనిపించేవిధంగా చిన్నచిన్న డ్రెస్సులు కూడా వేసుకుని తిరుగుతోందని సమాచారం!

ఈ నేపథ్యంలోనే తాప్సీకి ఓ దర్శకుడు తన సినిమాలో నటించాల్సిందిగా ఆపర్ ఇచ్చాడని సమాచారం! అయితే ఇందులో నటించాలంటే.. ముందుగా ఒక టెస్ట్ లో పాసవ్వాలని ఒక చిన్న పరీక్ష పెట్టాడట! ఆ పరీక్షలో భాగంగా ఈ అమ్మడు బికినీ వేసుకోవాల్సి వుంటుంది. దర్శకుడు తాప్సీకి ఈ మాట చెప్పగానే వెంటనే బికినీలో పోజులిస్తూ ఒక ఫోటోషూట్ ఇచ్చేసింది. అందులో ఈ అమ్మడు సాధ్యమైనంతవరకు తన అంగంగాలను ప్రదర్శిస్తూ చాలా హాట్ గా పోజులిచ్చిందని సమాచారం! ఎలాగైనా బాలీవుడ్ లో తన స్థానం పదిలం పర్చుకోవాలని భావించిన తాప్సీ కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా దర్శకుడికి పిచ్చెక్కిపోయేలా బికినీలో ఫోటోషూట్ ఇచ్చిందట! ఆ ఫోటోలను వీక్షించిన సదరు దర్శకుడు కూడా ఆమె అందాలకు ఫిదా అయిపోయి ఆమెకు తన సినిమాలో నటించే అవకావాన్ని ఇచ్చేశాడు.

అసలు విషయం ఏమిటంటే... సూజిత్ సర్కార్ అనే బాలీవుడ్ డైరెక్టర్ ఆయుష్మాన్ ఖురానాతో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. తొలుత అందులో కథానాయికగా యామీగౌతమ్ ని తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ఆ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో బికినీ ధరించుకోవాల్సి వుంటుంది. ముందుగా యామీగౌతమ్ ను బికినీ బాగుంటుందా లేదా అని టెస్ట్ చేశారు. అది వేసుకోవడానికి ముందు తడబడినా యామీ.. ఎలాగోలా వేసుకుంది. కానీ అందులో ఆమె అస్సలు సెట్ కాలేకపోయిందని ఆ మూవీ యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. యామీ కూడా బికినీలో కంఫర్ట్ గా వుండలేనని స్వయంగా పేర్కొంది కూడా! దీంతో ఆ డైరెక్టర్ తాప్సీని సంప్రదించి బికినీ టెస్ట్ చేయగా... అందులో ఆమె సెట్ కావడంతో ఓకే చేసేశారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో.. ప్రస్తుతం తాప్సీ కెరీర్ ని ‘‘బికినీ’’ మార్చేసిందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles