Fire accident in power movie shooting

fire accident in power movie shooting in bankok forest, raviteja power movie shooting, power movie shooting in bankok, raviteja power movie, raviteja in power movie, fire accident in power movie shooting, power movie shooting in bankok, hansika with regina in power movie, raviteja with hansika and regina in power movie

fire accident in power movie shooting in bankok forest

భారీ అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ ‘‘పవర్’’

Posted: 07/28/2014 05:11 PM IST
Fire accident in power movie shooting

మాస్ మహారాజా హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘‘పవర్’’! ఇందులో హీరోయిన్లుగా హన్సిక, రెజీనాలు నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇదివరకే యూరోప్ లో మూడు హాట్ గీతాలను తెరకెక్కించింది. ప్రస్తుతం మిగిలిన కొన్ని పవర్ చేజ్ సీన్లు, బ్లాస్టింగ్ సీన్లను రూపొందించేందుకు యూనిట్ మొత్తం బ్యాంకాక్ లో వున్నారు. అయితే అనుకోకుండా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం వల్ల ఈ షూటింగ్ ను క్యాన్సిల్ చేసినట్లు యూనిట్ వర్గాల సమాచారం!

సోమవారం ఉదయం పట్టాయా నగరానికి 200 కి.మీ. దూరంలో వున్న అడవిలో కార్ చేజింగ్, బ్లాస్టింగ్ సీన్లను చిత్రీకరించే సమయంలో బ్లాస్ట్ టైమర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ భారీ ప్రమాదం వాటిల్లిందని యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు. దాంతో ఒకేసారి మంటలు చెలరేగాయని వారు చెప్పారు. రవితేజ, బ్రహ్మాజీ, ఇంకా తదితర నటులు పాల్గొంటున్న ఈ షూట్ లో మాత్రం ఎవ్వరికీ గాయాలు కాలేదని, యూనిట్ మొత్తం సురక్షితంగానే వున్నారని వారు స్పష్టం చేశారు.

అయితే మంటలు ఒకేసారి పెద్దఎత్తున చెలరేగడం ద్వారా అడవి మొత్తం దహనం అవుతున్న నేపథ్యంలో షూటింగ్ క్యాన్సిల్ చేసి, ఆరోజు పేకప్ చెప్పేశారు. అక్కడి జరిగిన ఆ ప్రమాదం మీద అధికారులతో చర్చలు జరిపిన అనంతరం షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని దర్శకనిర్మాతలు వెల్లడిస్తున్నారు. ఏదైదేనేం.. తృటిలోనే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles