Ms narayana in guinness book of world records

ms narayana in guinness book of world records, telugu commedian ms narayana, ms narayana latest news, guinness book of world records, ms narayana name in guinness book of world record, ms narayana news, ms narayana wiki

telugu commedian ms narayana in guinness book of world records

గిన్నిస్ బుక్ రికార్డ్ లో మరో తెలుగు కమెడియన్

Posted: 07/28/2014 04:25 PM IST
Ms narayana in guinness book of world records

ఇంతవరకు తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతోమంది కమెడియన్లు తమతమ ప్రతిభతో ప్రేక్షకులను బాగానే అలరించారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే చిత్రపరిశ్రమలో తమదైన ఒక ప్రత్యేక ఇమేజిని క్రియేట్ చేసుకోగలిగారు. అందులో ముందుగా కామెడి కింగ్ బ్రహ్మానందం ముందు వరుసలో వుండి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకోగా.. ఇప్పుడు తాజాగా కమెడియన్ ఎమ్మెస్ నారాయణ కూడా అటువంటి ఘనతనే సొంతం చేసుకున్నాడు.

టాలీవుడ్ చాలావరకు తాగుబోతు పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న ఎమ్మెస్ నారాయణ.. ఆయన చేసిన సినిమాల్లో దాదాపు 70 శాతం వరకు అటువంటి పాత్రలే చేశారు. ఆయన 17 సంవత్సరాల తన సినిమా కెరీర్ లో 700పైగా సినిమాల్లో నటించారు. దీంతో ఈయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి చేరిపోయింది. గతంలో బ్రహ్మానందం తన 20 సంవత్సరాల కెరీర్ లో 700పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకుంటే.. ఇప్పుడా రికార్డ్ ను నారాయణ బ్రేక్ చేశాడు.

ఎమ్మెస్ నారాయణ కేవలం కమెడియన్ మాత్రమే కాదు.. దర్శకుడు, సింగర్ కూడా! ‘‘భజంత్రిలు, కొడుకు’’ వంటి రెండు సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు వహించిన ఈయన.. ‘‘కబడ్డీ కబడ్డీ’’ సినిమాలో తన రాగస్వరాలను కూడా వినిపించారు. తెలుగుతోపాటు రెండు తమిళ సినిమాల్లో కూడా కమెడియన్ గా నటించిన ఈయన టాలీవుడ్ లో మల్టీటాలెంటెడ్ యాక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు తాజాగా గిన్నిస్ బుక్ రికార్డ్ లో స్థానం కల్పించుకుని మరో అరుదైన ఘనతను సాధించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles