Kareena kapoor comments on saif ali khan hamshakals movie

kareena kapoor feeling bad about hamshakals movie, saif ali khan's hamshakals movie, kareena kapoor latest news, kareena kapoor comments on saif ali khan, hamshakals movie , kareena kapoor with saif ali khan, kareena kapoor news, saif ali khan latest news, kareena kapoor latest movie news, saif ali khan latest movie news, director sajid khan news, hamshakals movie photos

kareena kapoor feeling bad about saif ali khan to act in hamshakals movie

నా భర్త ఇంత పెద్ద తప్పు చేస్తాడని అనుకోలేదు!

Posted: 07/28/2014 01:37 PM IST
Kareena kapoor comments on saif ali khan hamshakals movie

బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్ ‘‘తన భర్త చాలా పెద్ద తప్పు చేశాడని.. ఇటువంటి తప్పు అతను చేస్తాడని తానెప్పుడూ ఊహించుకోలేదు’’ అని బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేసుకుంటోంది. కరీనా చెప్పిన ఈ మాటలను విన్న సినీ జనాలు.. ‘‘సైఫ్ అంత పెద్ద తప్పు ఏం చేసి వుంటాడా’’ ఆందోళనల్లో మునిగిపోయారు. బహుశా వీరిద్దరి దాంపత్యంలో ఏమైనా గొడవలు ప్రారంభమయ్యాయేమోనని అందరూ అనుకుంటున్న తరుణంలో ఈ అమ్మడు తన భర్త చేసిన తప్పు గురించి క్లారిటీ ఇచ్చేసింది.

కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ ఇటీవలే ‘‘హమ్ షకల్స్’’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే! భారీ క్యాస్టింగ్ తో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సైఫ్ అలీ ఖాన్ చరిత్రలోనే అట్టర్ ఫ్లాప్ గా నిలిచిపోయింది. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కేవలం 53 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి చతికిలపడిపోయింది. అయితే ఇంత చెత్త సినిమాకు కనీసం 53 కోట్లయినా వచ్చాయి కదా చిత్ర యూనిట్ వర్గాలు డప్పులు వాయించుకున్నారు.

ఇదిలావుండగా.. కరీనా.. ‘‘ఇంత చెత్త సినిమాల్లో నటించాల్సిన కర్మ ఏమొచ్చిందని’’ సైఫ్ ను మందలించడంతో తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ‘‘నేనూ ఈ సినిమాలో నటించి చాలా పెద్ద తప్పు చేశాను’’ అని సైఫ్ వెల్లడించాడు. అయితే తాజాగా ఈ విషయంపై కరీనా తన బాధను సన్నిహితుల దగ్గర వెల్లడించిందట! ‘‘సైఫ్ అలీ ఖాన్ హమ్ షకల్స్ మూవీలో నటించి చాలా పెద్ద తప్పు చేశాడని, కొన్ని సన్నివేశాల్లో సరిగ్గా నటించలేకపోయాడని’’ అని పేర్కొన్న ఆమె... ఈ విషయంపై సైఫ్ అలీ ఖాన్ కూడా చాలా బాధపడుతున్నాడని పేర్కొంది.

సాజిద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ నటించకపోతే చాలా బాగుండేదని ఆమె అభిప్రాయపడినట్లు సన్నిహితులు పేర్కొంటున్నారు. అలాగే సైఫ్ మరోసారి ఇటువంటి సినిమాలు చేయకుండా కరీనా జాగ్రత్తలు తీసుకుంటోందని తాజా సమాచారం! ఈ సినిమా ప్రాజెక్ట్ మొదలయినప్పటి నుంచే కరీనా చాలా అసంతృప్తిగా వుండేదని ఆమె అభిప్రాయపడినట్టు కొంతమంది పేర్కొంటున్నారు. ఎందుకంటే.. సాజిద్ ఖాన్ గతంలో తెరకెక్కించిన ‘‘జోకర్, హిమ్మత్ వాలా’’ వంటి సినిమాలు ఘోర పరాజయమయ్యాయి. ఇప్పుడు హమ్ షకల్స్ కూడా అనుకున్నదానికంటే ఘోర పరాజయం పాలవ్వడంతో ఆమె ఫీల్ అవుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles