Sai kumar plans movie like manam of akkineni 3 generations

Sai Kumar dialogue king, Akkineni 3 generations movie Manam, Sai Kumar plans 3 generations movie, Sai Kumar Adi and PJ Sharma movie, Daggubati 3 generations movie

Sai Kumar plans movie like Manam of Akkineni 3 generations with his son and father

మనం లా మేం వస్తాం అంటున్న డైలాగ్ కింగ్!

Posted: 07/27/2014 11:44 AM IST
Sai kumar plans movie like manam of akkineni 3 generations

అక్కినేని మూడు తరాల హీరోలతో వచ్చిన మనం సినిమా కథలో కొత్తదనం వల్లనైతేనేం, అక్కినేని ఆఖరు సినిమా అవటం వలన ఆయన మీద అభిమానులు చూపించి ఆదరణ వల్లనైతేనేం బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టింది.  

అలాగే మావీ మూడు తరాలున్నాయంటున్నారు సాయికుమార్.  ఖంగుమనే గొంతుతో తనదైన వేలెత్తి చూపించలేని డైలాగ్ డెలివరీ శైలితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయికుమార్ వరకు తెలుగువారి ఆదరణ బాగానే ఉంటుంది.  ఆది కూడా బాగానే అభిమానులను తయారుచేసుకున్నాడు.  ఇక వాళ్ళ పెద్ద తరం పి జె శర్మ కూడా ఒకప్పుడు నటుడే కానీ అక్కినేని నాగేశ్వరరావుతో పోల్చటానికైతే తగరాయన.  కానీ ఇక్కడ పోటీ మనం తో లేదు కదా!  పోలిక కేవలం మూడు తరాల వరకే.  

అందువలన తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని ఆఖరు సినిమా గా మనం కి ఉన్న క్రేజ్ మరే సినిమాకీ లభించకపోవచ్చు కానీ దేనికదే కదా!  మంచి కథ, కథనం ఉన్నట్లయితే, కొత్తదనం కనిపిస్తే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాలో ఎవరు నటించినా ఆదరిస్తారు.  

manam-movie

సాయికుమార్ తమ్ముడు అయ్యప్ప దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకి మేంవి, వియ్ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నామని అన్నారు సాయికుమార్.  అయితే దగ్గుబాటి కుటుంబం కూడా మూడు తరాల సినిమా బరిలో ఉంది.  రామానాయుడు, వెంకటేష్, రానాలతో కూడా ఇదే లైన్ లో మరో సినిమా వచ్చే అవకాశం ఉంది.  

ఎన్ని సినిమాలు వస్తే మనం సినిమాని అంతబాగా ప్రేక్షకులు గుర్తుచేసుకుంటారన్నది మాత్రం నిజం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles