Mumbai actress harrassed by fake salman khan facebook page

mumbai actress, actress harrassed by salman khan, actress harrassed by fake salman khan, salman khan facebook page, being salman khan facebook page, being salman khan news, salman khan official facebook account, actress cheated by fake salman khan, actress cheated by salman khan, salman khan cheated a woman

Mumbai actress harrassed by fake salman khan facebook page

హీరోయిన్ నగ్నఫోటోలను అడిగిన సల్మాన్ ఖాన్!

Posted: 07/26/2014 04:47 PM IST
Mumbai actress harrassed by fake salman khan facebook page

(Image source from: Mumbai actress harrassed by fake salman khan facebook page)

అవును.. మీరు వింటున్నది నిజమే! సల్మాన్ ఖాన్ ఒక హీరోయిన్ నగ్న ఫోటోలను కావాలంటూ, అసభ్యకరమైన భాషతో సంభాషణలు చేశాడు. దీంతో షాక్ తిన్న సదరు యువతి ఏం చేయాలో తెలియక ఆందోళనల్లో పడిపోయింది. సల్మాన్ ఖాన్ లాంటి నటుడు ఒక అమ్మాయితో ఇలా ప్రవర్తించడమేంటని ఆశ్చర్యపోయిన సదరు నటి.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సల్మాన్ ఖాన్ అసలు రంగును బయటపెట్టారు.

అసలు విషయం ఏమిటంటే... ‘‘బీయింగ్ సల్మాన్ ఖాన్’’ అనే పేరుతో ఫేస్ బుక్ లో క్రియేట్ చేసి వున్న పేజీని ఒక డాక్యుమెంటరీ నటి గత సెప్టెంబరులో లైక్ చేసింది. అందులో దాదాపు అన్ని సల్మాన్ ఖాన్ వ్యక్తిగత ఫోటోలు ఎక్కువగా వుండటం వల్ల అదే సల్మాన్ ఖాన్ దే అఫీషియల్ పేజీ అని భావించింది. పైగా ఆ పేజీకి లక్షకు పైగా లైక్స్ వుండటంతో ఆమె ఏమీ ఆలోచించకుండా సల్మాన్ ఖాన్ దే అని ఫిక్స్ అయిపోయింది. ఎప్పటిలాగా ఆ పేజీని ఫాలో అవుతూ.. అప్ లోడ్ అయిన ఫోటోలను లైక్ చేస్తూ సల్మాన్ ను పొగుడుతూ కామెంట్లు చేసిది.

ఈ నేపథ్యంలోనే ఒకనాడు ఆమె సల్మాన్ తో మాట్లాడాలని సందేశం పంపింది. వెంటనే సమాధానం రాలేదు కానీ... కొన్ని రోజుల అనంతరం ఆ పేజీ సృష్టించిన వ్యక్తి ఆమెతో చాటింగ్ చేయడానికి సిద్ధమని సంకేతాలిచ్చాడు. తన గత అనుభవాలు, ఎఫైర్లు, ఇంకా తదితర విషయాలు ఆమెతో పంచుకున్నాడు. సల్మాన్ ఖాన్ నిజజీవిత విషయాల గురించి అచ్చుగుద్దినట్టు చెప్పాడు. దీంతో ఆమె చాటింగ్ చేస్తున్నత్తు సాక్షాత్తూ సల్మాన్ ఖానేనని భ్రమలో టోటల్ గా మునిగిపోయింది. ఇలా వీరిద్దరి మధ్య పరిచయం తారాస్థాయిలో బలపడిపోయింది.

అయితే ఒకనాడు సల్మాన్ పేజీని క్రియేట్ చేసిన వ్యక్తి ఆమెతో చాటింగ్ చేస్తూ.. తన నగ్న ఫోటోలు కావాలని కోరాడు. మొదట షాక్ కు గురైన ఆమె.. తరువాత జోక్ అనుకుని భావించి లైట్ తీసుకుంది. కానీ అతను మాత్రం వదలకుండా అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించి ఆమెతో మాట్లాడటం, నగ్న ఫోటోలను ఎలాగైనా పంపించమని పట్టుబడటంతో ఆమెకు అనుమానం వచ్చి చాటింగ్ కు స్వస్తి చెప్పింది. ఈ విషయంపై వెంటనే ఆమె ముంబయిలోని వాన్నాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫేస్ బుక్ పేజీ నకిలీది అని ఖరారు చేశారు. అతని కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles