టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన బెల్లంకొండ సురేష్... తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను ‘‘అల్లుడు శీను’’గా తెలుగుతెరకు పరిచయం చేశాడు. దాదాపు 50 కోట్ల మేర భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించగా.. హీరోయిన్ గా గ్లామర్ డాల్ సమంత నటించింది. నిర్మాత బెల్లంకొండ వీరిద్దరికీ సాధ్యమైనంత న్యాయమే చేశాడు. వినాయక్ కు 11 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వగా... సమంతకు దాదాపు 3 కోట్ల వరకు సమర్పించుకున్నాడని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. పైగా ఇందులో నటించిన నటీనటులందరూ సీనియర్లే!
టాలీవుడ్ లోనే ఒక కొత్త హీరో అదిరిపోయే రేంజిలో ఈ సినిమాను నిర్మాత ఖర్చుపెట్టేశాడు. స్టార్ హీరోతో సినిమాలు 30 కోట్లవరకు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తే.... అవి హిట్టయితే గానీ కలెక్షన్లు భారీగా వస్తాయి. అలాకాకుండా మిక్స్ డ్ టాక్ వస్తే మాత్రం ఖర్చుపెట్టిన డబ్బులు కూడా వసూలు కాక.. నిర్మాతలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినాగానీ బెల్లంకొండ సురేష్ మాత్రం డబ్బుల గురించి ఆలోచించకుండా తన తనయుడి కోసం తన ఆస్తినంతటిని అమ్మేసి మరీ తీసినట్టు కనిపిస్తోంది. మరీ ఈ కొత్త హీరో సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో..?
రిలీజైన మొదటిరోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. యాక్షన్ సన్నివేశాలతోపాటు తన డ్యాన్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని ట్రేడ్ వర్గాలు పక్కాగా చెబుతున్నాయి. ఇక కలెక్షన్లపరంగా కూడా ఈ సినిమా దూసుకుపోతోందని బాక్సాఫీస్ రికార్డులు చెబుతున్నాయి. ఈ సినిమా దాదాపు 5 నుంచి 7 కోట్ల దాకా వసూలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు. టాలీవుడ్ లో ఒక కొత్త హీరో సినిమా ఇంత భారీగా వసూలు చేయడం ఇదే మొదటిసారినని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఈ సినిమా 50 కోట్ల మార్క్ ను దాటేస్తుందని వారు పేర్కొంటున్నారు.
ఇంతవరకు బాగానే వుంది కానీ... ఈ సినిమాకు మొత్తం అయిన ఖర్చు 50 కోట్లు! పైగా సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాలతో రిలీజైంది కాబట్టి మొదటిరోజుల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం సహజమేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా మొత్తం జాతకం తెలియాలంటే.. ఈ వారాంతంలో వచ్చే కలెక్షన్ల ఆధారంగా లెక్క వేయొచ్చని చెబుతున్నారు. మరి అల్లుడు శీను తన విజయాన్ని దక్కించుకున్న మాట అటుంచితే.. కలెక్షన్లలో తన జోరును పెంచుకోగలడా..? మొదటి సినిమాతోనే 50 కోట్ల మార్క్ ను శ్రీనివాస్ అధిగమించగలడా..? ఈ విషయాల మీద స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more