Chiranjeevi to launch govindudu andarivadele movie teaser

chiranjeevi to launch govindudu andarivadele movie teaser on ramzan festival, govindudu andarivadele movie news, ram charan govindudu andarivadele movie news, ram charan with kajal agarwal, ram charan latest photos, kajal agarwal latest hot photos, chiranjeevi latest news, chiranjeevi with ram charan

chiranjeevi to launch govindudu andarivadele movie teaser on ramzan festival

చిరు చేతిలోపడ్డ ‘‘గోవిందుడు’’!

Posted: 07/25/2014 06:10 PM IST
Chiranjeevi to launch govindudu andarivadele movie teaser

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తాజాగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘‘గోవిందుడు అందరివాడేలే’’! ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బండ్లగణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకే కొన్ని ఫోటోలు కూడా రిలీజయ్యాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రంజాన్ పండుగ సందర్భంగా 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు సమాచారం!

అయితే ఈ టీజర్ ను కొంచెం గ్రాండ్ గా రిలీజ్ చేయాలని భావించిన దర్శకనిర్మాతలు... మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నానక్ రామ్ గూడా రామానాయుడి స్టూడియోస్ లో నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త పోనీటైల్ అవతారంలో ప్రేక్షకులను అలరించనున్నాడని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. అన్ని సజావుగా సాగితే ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles