బాలీవుడ్ మాజీ ప్రేమజంట అయిన దీపికా పదుకొనె, రణబీర్ కపూర్ లకు సంబంధించి ఒక వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. అందరూ ఆ వీడియోను చూసి తెగ ఆనందపడుతున్నారు. గతంలో చట్టాపట్టాలేసుకుని పీకల్లోతుదాకా ప్రేమలో మునిగిపోయిన ఈ జంట... కొన్ని పర్సనల్ కారణాల వల్ల విడిపోయారు. అయితే వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియో తాజాగా విడుదల కావడం సంలచనంగా మారిపోయింది. ఇద్దరూ అడ్డంగా బుక్కయ్యారని ప్రతిఒక్కరు ఈ వీడియో మీద తమ అభిప్రాయాలను వెళ్లగక్కుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే... ‘‘ఏ జవానీ హై దివానీ’’ చిత్రం తరువాత ఈ జంట తిరిగి ఏ సినిమాలోనూ నటించలేదు. ఎక్కడా కలుసుకోలేదు కూడా! ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ తిరిగి కలుస్తున్నారని, బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘‘తమాషా’’ సినిమాలో వీరు కనువిందు చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ.. ఈ మాజీ ప్రేమజంట తమ లేటెస్ట్ చిత్రం ‘‘తమాషా’’కు సంబంధించి ఒక పాటలో డ్యాన్స్ చేస్తున్న వీడియో లీక్ అయ్యింది.
అందులో మొదట రణబీర్ నాగిన్ డ్యాన్స్ చేయగా.. తరువాత దీపికా కూడా అతనితో కలిసింది. అనంతరం తిరిగి తమ వెస్టర్న్ డాన్స్ స్టైలుకి వెళ్లిపోతారు. ఈ పాటలో రణబీర్ ప్యాంట్, షర్ట్ వేసుకుంటూనే వాటిమీద వెరైటీ జాకెట్ వేసుకుంటూ కనిపించాడు. ఇక దీపికా ఎప్పటిలాగే తన పొడుగుకాళ్ల అందాలను ప్రదర్శిస్తూ చిందులేసింది. ఈ విధంగా వీరిద్దరూ చిందులేసిన వీడియోను వీక్షించిన నెటిజన్లు... మాజీ ప్రేమజంట మళ్లీ కలుసుకున్నారని, ఇకనుంచి వీళ్లు మళ్లీ డేటింగ్ చేయనున్నారని తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో ప్రత్యేకంగా మీకోసం...
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more