Ram charan brand ambassador for turbo mega airways

turbo mega airways, Ram Charan Tej brand ambassador for his company turbo mega airways, ram charan tej latest news, ram charan tej enters in airlines, ram charan tej news, ram charan tej in govindudu andarivadele movie, ram charan tej brand ambassador for private products, ram charan tej with vankayapati umesh, ram charan tej with kajal agarwal, ram charan tej in turbo mega airways

Ram Charan Tej brand ambassador for his company turbo mega airways

‘‘మెగా’’ బ్రాండ్ కు అంబాసిడర్ గా చెర్రీ

Posted: 07/24/2014 01:06 PM IST
Ram charan brand ambassador for turbo mega airways

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇటీవలే విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే! కేంద్రప్రభుత్వం 8 కొత్త కంపెనీలను మంజూరు చేసిన సందర్భంగా రామ్ చరణ్ వ్యాపారపరంగా ముందడుగు వేశాడు. చెర్రీతోపాటు తన స్నేహితుడైన వంకాయలపాటి ఉమేష్ ఇద్దరూ కలిసి ‘‘టర్బో మెగా ఎయిర్ వేస్’’ అనే విమానయాన సంస్థను ఏర్పాటు చేయగా... అందులో డైరెక్టర్ గా ఉమేష్ వ్యవహరించనున్నాడు. ఇక చెర్రీ తన సొంత సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు.

గతంలో రామ్ చరణ్ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న సంగతి విదితమే! ఇప్పుడు తాజాగా తన సంస్థకే మెగాఫోన్ పట్టనున్నాడు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో డైరెక్టర్ ఉమేష్ మాట్లాడుతూ... రామ్ చరణ్ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడని పేర్కొన్నాడు. చెన్నై, బెంగళూరు, టుటికారిన్, మధురై, బెల్గాం, హుబ్లీ వంటి తదితర ప్రాంతాల మధ్య తమ సర్వీసులను ప్రారంభించాలని, అందుకోసం 68 సీట్లుండే క్యూ-400 బొంబార్డియర్ ఎయిర్ క్రాఫ్ట్‌లను సిద్ధం చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

తాము సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్న ఈ ఎయిర్ వేస్ సంస్థలో ప్యాసింజర్లకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్నివిధాలుగా మంచి సౌకర్యాలతో కూడిన సేవలను అందిస్తామని ఆయన వెల్లడించారు. రామ్ చరణ్ తేజ త్వరలోనే మీడియా ముందుకు వచ్చి ఈ విషయంపై అధికారికంగా ప్రకటన ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం చెర్రీ, కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘‘గోవిందుడు అందరివాడేలే’’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles