Power movie satellite rights sold by gemini tv

Raviteja power movie satellite rights sold by gemini tv channel, tollywood actor raviteja latest news, raviteja latest news, raviteja in power movie, raviteja power movie news, raviteja power movie satellite rights, raviteja power movie satellite rights sold by gemini tv, raviteja with hansika, hansika hot photo shoot, raviteja power movie release date, raviteja power movie review, raviteja power movie trailer, raviteja power movie stills

Raviteja power movie satellite rights sold by gemini tv channel

‘‘పవర్’’ హక్కుల్ని భారీగా అమ్ముకున్న రవితేజ!

Posted: 07/24/2014 11:23 AM IST
Power movie satellite rights sold by gemini tv

‘‘బలుపు’’ సినిమాకు ముందు రవితేజ నటించిన దాదాపు 6 సినిమాలు వరుసగా ఘోరంగా పరాజయాన్ని చవిచూశాయి. దే ధనా ధన్ అంటూ ఒక్కొక్కటిగా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అయిపోతుండటం చూసి ఆయన కెరీర్ ఇక్కడితోనే ముగిసిందని ప్రతిఒక్కరు అనుకున్నారు. ఆయన నటించిన సినిమాలను కొనుగోలు చేయడానికి బయ్యర్లు ముందుకు రావడానికే భయపడేవారు. కానీ ‘‘బలుపు’’ సినిమా హిట్టవ్వడంతో రవితేజ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఆయన కెరీర్ లోనే ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇప్పుడు తాజాగా రవితేజ నటిస్తున్న ‘‘పవర్’’ సినిమా కూడా అదేరేంజిలో హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు మార్కెట్ లో అప్పుడే వ్యాపారం మొదలైందని సమాచారం! ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకోవాలనే పట్టుదలతో బయ్యర్లు వెంటపడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం శాటిలైట్ హక్కుల్ని దాదాపు రూ.7.50 కోట్లకు జెమినీ టీవీ కొనుగోలు చేసిందని ఫిల్మ్ నగర్ సమాచారం! రవితేజ కెరీర్ లోనే శాటిలైట్ రైట్స్ పవర్ ఫుల్ రేటుకు అమ్ముడుపోయాయని చిత్రపరిశ్రమలో జోరుగా వార్తలొస్తున్నాయి.

‘‘పవర్’’ సినిమాకు సంబంధించి గతంలో రిలీజైన టీజర్ లో రవితేజ ఒక పోలీసు అధికారి పాత్రలో చెప్పిన డైలాగులు అదిరిపోయే రేంజులో వున్నాయని ప్రతిఒక్కరి నుంచి విశేష స్పందన లభించింది. టీజర్ విడుదలైన ఒక వారంరోజుల్లోనే దాదాపు 6లక్షలకు పైగా నెటిజన్లు దీనిని వీక్షించడం విశేషం! ఈ కారణాల వల్లే మార్కెట్ వర్గాలు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. పైగా శాటిలైట్ రైట్స్ కూడా భారీగా అమ్ముడుపోవడం వల్ల ఈ సినిమా ఖచ్చితంగా భారీ హిట్ కొడుతుందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

‘‘పవర్’’ సినిమాలో రవితేజ సరసన హన్సిక కథానాయికగా నటిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ఛేజింగ్ సన్నివేశాలను బ్యాంకాక్ లో తెరకెక్కిస్తున్నారు. ఆ షెడ్యూల్ పూర్తయితే దాదాపు సినిమా మొత్తం ముగిసినట్టేనని... త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో దర్శకనిర్మాతలు పడిపోయారు. ఈ సినిమా రవితేజ కెరీర్ ను ఎటువంటి మలుపులు తిప్పుతుందో రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles