Samantha taking revenge on actor surya

samantha ruth prabhu taking revenge on actor surya, samatha latest news, samantha news, samantha hot photos, samantha latest news, samantha tweet on anjaan movie

samantha ruth prabhu taking revenge on actor surya

సూర్యపై పగతీర్చుకుంటున్న సమంత!

Posted: 07/23/2014 03:54 PM IST
Samantha taking revenge on actor surya

సౌత్ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూపోతున్న సమంత ప్రవర్తనలో రానురాను చాలా మార్పులు వస్తున్నాయంటూ వార్తాకథనాలొస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా అందరూ ఈమె ట్విటర్ అకౌంట్ ను తీసుకుంటున్నారు. గతంలో మహేష్ బాబు ‘‘నేనొక్కడినే’’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ పై ఈ అమ్మడు ట్విటర్ లో నోరుపారేసుకుంది. దాంతో ఆ మేటర్ పెద్ద దుమారాన్నే రేపింది. అలాగే ‘‘ఆగడు’’ టీజర్ పై వ్యంగ్యంగా కామెంట్లు చేసి బుక్ అయింది. ఇప్పుడు సమంత తాజాగా చేసిన ట్వీట్ కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

సమంత, సూర్య జంటగా కలిసి నటించిన తాజా చిత్రం ‘‘అంజాన్’’! ఈ సినిమా ఆడియో విడుదల ఆదివారం నాడు జరిగిపోయింది. అయితే ఈ ఆడియో వేడుకకు మాత్రం సమంత హాజరు కాలేదు. ఇంతటితో ఆగకుండా.. తాను ఈ వేడుకకు రానందుకు విచారాన్ని తెలుపుతూ ట్వీట్ చేసింది. ‘‘ఈరోజు నా లైఫ్ లోనే చాలా వరస్ట్ డే! నేను ఫ్లైట్ మారుతున్నప్పుడు బ్యాగ్ మిస్సయ్యింది. పైగా ఫ్లై కూడా లేట్ అయింది. దానికితోడు ఫుడ్ కూడా పాయిజన్ అయింది. అందుకే నేను ఆడియో ఫంక్షన్ కు రాలేకపోయాను’’ అంటూ ట్వీట్ చేసింది.

అయితే ఇప్పుడు ఈమె చేసిన ట్వీట్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. సమంత కావాలని ఈ ఆడియో వేడుకకు రాలేదని కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అంజాన్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఫోటోలను రిలీజ్ చేసినప్పుడు అందులో సమంత ఫోటో వేయకపోవడం వల్ల ఈ అమ్మడు పెద్ద దుమారాన్నే రేపింది. ఇప్పుడు ఈ ఆడియో వేడుకకు హాజరు కాకుండా తన ప్రతీకారాన్ని తీర్చుకుంటోందంటూ యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles