Amitabh bachchan shamitabh movie first look

Amitabh Bachchan revealed his character in shamitabh movie on twitter, amitabh bachchan latest news, amitabh bachchan in shamitabh movie, shamitabh movie first look, amitabh bachchan posted his character role on twitter, amitabh bachchan twitter, amitabh bachchan latest photos in shamitabh movie

Amitabh Bachchan revealed his character photograph in shamitabh movie on twitter

ఈయనెవరో తెలుసుకోండి చూద్దాం..!

Posted: 07/21/2014 01:09 PM IST
Amitabh bachchan shamitabh movie first look

అదేనండి! బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్! ఈయన నటిస్తున్న తాజా చిత్రం ‘‘షమితాబ్’’! ఈ సినిమాలో ఆయన నటిస్తున్న సందర్భంగా అందులో తన పాత్ర గురించి జనాలకు తెలియజేస్తూ అమితాబ్ తన ట్విటర్ ఈ ఫోటోను పోస్ట్ చేసుకున్నాడు. ఇందులో తన క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా వుంటుందని, ఇటువంటి పాత్రలో నటించడం తనక్కూడా ఎంతో ఆహ్లాదాన్ని కల్పిస్తోందని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇందులో భాగంగానే ఆయన.. ‘‘షమితాబ్ షూటింగ్ లో పాల్గొన్న నేను.. ఆ రోజంతా ఆ పాత్రలో విలీనమయి, ఆ జుట్టును కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలో చాలా శ్రమించానని, ఇలా వుండటం నాకు మంచి అనుభవాన్ని కలిగింది’’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. దీనిపై ఆయన అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆయన గెటప్ చాలా థ్రిల్లింగ్ గా వుందని, ఈ చిత్రం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ రీట్వీట్ చేశారు.

గతంలో అమితాబ్ నటించిన ‘‘చీని కమ్, పా’’ వంటి అనూహ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్. బల్కీ.. ఈ ‘‘షమితాబ్’’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను వహిస్తున్నాడు. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తుండగా... విలక్షణ నటుడు కమల్ హాసన్, శృతిహాసన్ చెల్లెలు అయిన అక్షర హాసన్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles