Salman khan settairs on amir khan

Salman khan settairs on Amir khan, salman khan latest news, salman khan comments on aamir khan, salman khan with amir khan, amir khan comments on salman khan, salman khan controversial comments on amir khan, amir khan latest news, salman khan news

Salman khan settairs on Amir khan

ఆమీర్ పై సెటైర్లు వేసిన సల్మాన్ ఖాన్!

Posted: 07/14/2014 05:35 PM IST
Salman khan settairs on amir khan

(Image source from: Salman khan settairs on Amir khan)

ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల మధ్య వున్నంత సాన్నిహిత్యం బహుశా ఏ బాలీవుడ్ హీరోల మధ్య కూడా వుండదు. ఎవరిదైనా మూవీ రిలీజ్ అవుతుందనుకుంటే అందుకు ఒకర్నొకరు సహకరించుకుంటూ ప్రచారాలు చేసుకుంటారు. ఇక సల్మాన్ ఖాన్ అయితే ఏ ఫంక్షన్ లో అయినా ఆమీర్ ఖాన్ గురించి ఏదో ఒక ప్రస్తావన తీసుకొస్తాడు. ఇంతవరకు వీరిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు రాలేదు. ఒకవేళ రూమర్లు వచ్చినా... ‘‘మా మధ్య ఎటువంటి గొడవలు లేవు’’ అంటూ వాటిని చాలా సున్నితంగా ఇద్దరూ కలిసి తిరస్కరిస్తారు.

అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ మీద సెటైర్లపై సెటైర్లు వేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ తాను తాజాగా నటించిన ‘‘కిక్’’ సినిమా విశేషాల గురించి చెబుతూ.. తాను పాడిన పాట గురించి చెప్పుకున్నాడు. మొదట్లో తాను సినిమాలో పాట పాడటానికి అంగీకరించలేదని... రికార్డింగ్ చేసిన తరువాత పాట ఎంతో నచ్చిందని పేర్కొన్నాడు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పాటలు పాడేందుకు ఆసక్తి చూపుతున్నాడు సల్లూభాయ్! ఇంతవరకు బాగానే వుందికానీ.. తన సహచర హీరోల గురించి వారు పాటలు పాడే విధానం గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోలయిన సంజయ్ దత్, ఆమీర్ ఖాన్ గురించి చెప్పుకొచ్చాడు. మొదట సంజయ్ దత్ గురించి మాట్లాడుతూ.. ‘‘సంజయ్ దత్ ఎంతో బాగా పాటలు పాడుతాడు. అతను మంచి గాయకుడే కాదు.. బొంగో, తబలా, హార్మోనియం వంటి వాటిని కూడా అద్భుతంగా వాయిస్తాడు’’ అని ఆకాశానికెత్తేశాడు. అదే సమయంలో హీరో ఆమీర్ ఖాన్ గురించి చెబుతూ.. ‘‘అసలు ఆమీర్ ఖాన్ పాటలు ఎప్పుడూ పాడాడు. అతను పాటలను కూడా మాటల రూపంలో పలికేస్తాడు కదా’’ అంటూ నవ్వుతూ సెటైర్లు వేశాడు.

సల్లూ భాయ్, ఆమీర్ మీద ఈ విధంగా సెటైర్లు వేయడం బాలీవుడ్ లో పెద్ద దుమారం రేపుతోంది. వీరిద్దరి మధ్య ఏదైనా విషయంలో విభేదాలొచ్చాయా అని కొంతమంది అనుకుంటుంటే... మరికొందరేమో సల్మాన్ అదేపనిగా కామెడీకోసం అలా వ్యవహరించి వుంటాడని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా బాలీవుడ్ లో వున్న అగ్రహీరోలు తమ సహచర హీరోల గురించి అప్పుడప్పుడు ఇలా కుళ్లు జోకులు వేసుకోవడం కామనేనని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles