Director rajamouli clarrifies about twitter war between samantha and him

director rajamouli clarrifies about twitter war between samantha and him, director rajamouli latest news, director rajamouli news, actress samantha latest news, samantha with director rajamouli, rajamouli with samantha, samantha and rajamouli twitter war, twitter war between samantha and rajamouli, samantha comments on rajamouli

director rajamouli clarrifies about twitter war between samantha and him

బాహుబలి యుద్ధం ముగిసింది!

Posted: 07/14/2014 02:13 PM IST
Director rajamouli clarrifies about twitter war between samantha and him

(Image source from: director rajamouli clarrifies about twitter war between samantha and him)

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘‘బాహుబలి’’. రోజురోజుకు ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వస్తూనే వున్నాయి. గతంలో ఈ సినిమాలో విలన్ ఒక హాలీవుడ్ నటుడు నటిస్తున్నాడంటూ వార్తలు పుకార్లు చేశాయి. కానీ డైరెక్టర్ రాజమౌళి దానిని ఖండించాడు. ఇప్పుడు తాజాగా రాజమౌళి, సమంతకు ఈ సినిమాకు సంబంధించి ట్విటర్ గొడవ జరిగి, విభేదాలొచ్చాయన్న వార్తలను చెక్ పెట్టి స్పష్టత ఇచ్చాడు.

మొన్నటికి మొన్న ‘‘బాహుబలి సినిమాలో సమంత గెస్ట్ రోల్ చేస్తే చాలా బాగుంటుందని, ఆమెతోపాటు జూనియర్ ఎన్టీయార్ కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తే ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని’’ అభిమానులు రాజమౌళికి సలహాలు ఇచ్చారు. వీరికితోడుగా సమంత కూడా కొన్ని ట్వీట్ లు చేసింది. ‘‘నాకు బాహుబలి సినిమాలో నటించాలని వుంది కానీ.. డైరెక్టర్ రాజమౌళి ఆ అవకాశం ఇవ్వడం లేదంటూ’’ చెప్పుకొచ్చింది.

దీనిపై రాజమౌళి కూడా ఘాటుగానే స్పందించాడు. ‘‘ఏంటి సమంత ఇలా చేస్తున్నావు. నేను నిన్ను బాహుబలిలో గెస్ట్ రోల్ చేయాల్సిందిగా సీక్రెట్ గా అడిగితే.. నువ్వు మాత్రం డేట్స్ లేవని తప్పుకున్నావు. ఇప్పుడు చూస్తే నీ ఫ్యాన్స్ ని నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నావు’’ అని సమాధానిమిచ్చాడు. రాజమౌళి అభిమానులు కూడా సమంత ఎందుకిలా చేస్తుందోనని కొంతవరకు విమర్శలు చేశారు కూడా!
దీంతో వీరిద్దరి మధ్య ట్విటర్ లో మాటల యుద్ధం జరిగిందని, భవిష్యత్తుల్లో వీరిద్దరు కలిసి సినిమాలు తీసే ఛాన్స్ లేదంటూ వార్తలు జోరుగా సాగాయి.

ఇప్పుడు ఈ వార్తలపై డైరెక్టర్ రాజమౌళి స్పందించాడు. తనకు, హీరోయిన్ సమంతకు ఎటువంటి గొడవలు, విభేదాలు లేవని స్పష్టం చేశాడు. ట్విటర్ లో తామిద్దరం చేసుకున్న వ్యాఖ్యలు సరదా కోసమేనని... వాటి ఆధారంగా లేనిపోని వార్తలు పుట్టుకొచ్చాయని ఆయన పేర్కొన్నారు. గతంలో తాను సమంతకు గెస్ట్ రోల్ చేయాల్సిందిగా అడిగింది నిజమేనని, అప్పుడు సమంత అందుకు డేట్స్ లేవని నిరాకరించిందని తెలిపారు. ఇప్పుడు ట్విటర్ లో అదే విషయం మీద మేమిద్దరం చర్చించుకున్నామని, ఆ నేపథ్యంలోనే నేను ‘‘నీ అభిమానులను నాపై వ్యతిరేకంగా ప్రచారం ఎందుకు చేస్తున్నావని’’ సమంతను ఉద్దేశించి కామెంట్లు చేశానని చెప్పారు. దీన్ని ఆధారంగా చేసుకుని అనవసరంగా వార్తలు నాకు, సమంతకు విభేదాలొచ్చినట్టు వార్తలు వస్తున్నాయని... ఇటువంటి మాటలను అస్సలు పట్టించుకోవద్దని ఆయన స్పష్టం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles