Pooja hegde grabbed bollywood chance opposite to hrithik roshan

former miss india pooja hegde grabbed bollywood chance opposite to hrithik roshan, pooja hegde latest news, pooja hegde news, pooja hegde get chance in mohanjadaro movie, pooja hegde with hrithik roshan, hrithik roshan latest news, hrithik roshan with pooja hegde, pooja hegde news, pooja hegde with hrithik roshan

pooja hegde grabbed bollywood chance opposite to hrithik roshan

అదృష్టం తలుపుతడితే ఇలాగే వుంటుంది!

Posted: 07/14/2014 01:40 PM IST
Pooja hegde grabbed bollywood chance opposite to hrithik roshan

చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ప్రతీ హీరోయిన్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించాలని అనుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం తమ అంగఅంగాలను ప్రదర్శిస్తూ బికినీల్లో రకరకాల ఫోటోషూట్ లు ఇచ్చేస్తారు. సాధ్యమైనంతవరకు న్యూడ్ గా నటించడానికి కూడా సిద్ధంగా వుంటారు. అప్పుడే ఎరవకో ఒకరిని అదృష్టం వరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక హీరోయిన్ కు ఇందుకు భిన్నంగా జరిగింది.

చిత్రపరిశ్రమలో అంతగా పేరు లేకపోయినా, ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా, ఎందరో అగ్ర కథానాయికలు పరిశ్రమలో తమ ప్రతిభను చాటుకుంటూ రాజ్యమేలుతున్నా... ఆమెకు మాత్రం అదృష్టం వెతుక్కుంటూ మరీ వెళ్లింది. పైగా తాను అగ్ర హీరోలతో కూడా నటించలేదు. యువ హీరోలతో చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ కాలం గడపుతున్న ఆ సన్నజాజి తీగ మరెవరో కాదు... మాజీ మిస్ ఇండియా, కన్నడ బ్యూటీ పూజా హెగ్డే!

2012లో ‘‘మూగమూడీ’’ సినిమా ద్వారా కోలీవుడ్ కు పరిచయమైన ఈ అమ్మడు... ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా వుంది. అందులో ఒకటి నాగబాబు తనయుడు అయిన వరుణ్ తేజ్ ఎంట్రీ మూవీ ‘‘గొల్లభామ’’ అయితే, మరొకటి నాగచైతన్య సరసన ‘‘ఒక లైలా కోసం’’ అనే మూవీలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిన్న సినిమాలే! కానీ అదృష్టం మాత్రం ఈమెను వెతుక్కుంటూ వచ్చినట్టుంది. ఏకంగా బాలీవుడ్ లో అదికూడా హృతిక్ రోషన్ సరసన, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

‘‘లగాన్’’ మూవీ దర్శకుడు అశుతోష్ లేటెస్ట్ గా హృతిక్ రోషన్ తో కలిసి ‘‘మోహంజోదారో’’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో హీరోయిన్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టిన డైరెక్టర్... అన్నిరంగాల్లో చక్కర్లు కొడుతూ చివరికి ఈ మాజీ మిస్ ఇండియా దగ్గరకు చేరుకున్నాడు. ఆమెను తన సినిమాలో నటించేందేకు ఫోన్ చేయగా... అందుకు ఆమె వెంటనే ఓకే అని చెప్పేసింది. బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది అది కూడా హృతిక్ రోషన్ సినిమాలో అంటూ ఫుల్ ఖుషీగా తన ఆనందాన్ని నలుగురితో పంచుకుంటోంది.

ఇదిలావుండగా ‘‘ఒకవైపు ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ, బాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న తారలు అవకాశాలకోసం వెంపర్లాడుతుంటే... ఈమె మాత్రం అదృష్టాన్ని కొట్టేసింది’’ అంటూ అందరూ మండిపడుతున్నారని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. పూజా హెగ్డే మాత్రం ఇటువంటి కామెంట్ల గురించి పట్టించుకోకుండా కేవలం తన మూవీ మీద దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఈ మూవీ.. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles