Hamsa nandini reduces her remuneration for gopichand movie

hamsa nandini reduces her remuneration for gopichand movie, hamsa nandini latest news, hamsa nandini in item songs, hamsa nandini hot photo shoot, hamsa nandini news, hamsa nandini with gopichand, hamsa nandini reduces her remuneration for gopichand movie, hamsa nandini wants to work with gopichand, hamsa nandini comments on gopichand, hamsa nandini hot photos, hamsa nandini images, hamsa nandini stills

hamsa nandini reduces her remuneration for gopichand movie

ఆయనతో ఒక్కసారైనా చేయాలనుంది! హంసా

Posted: 07/12/2014 02:25 PM IST
Hamsa nandini reduces her remuneration for gopichand movie

(Image source from: hamsa nandini reduces her remuneration for gopichand movie)

హీరోయిన్ గా చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోదామని ఎంట్రీ ఇచ్చిన చాలామంది భామల్లో కొంతమంది సైడ్ క్యారెక్టర్స్ పాత్రలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం ఐటమ్ గాళ్స్ గా స్థిరపడిపోయారు. ఈ తరహాలోనే హంసానందిని కూడా హీరోయిన్ అవుదామని టాలీవుడ్ కి ఎంట్రీ  అవకాశాలకోసం ఎన్నో కష్టాలు పడినా ఆమెకు ఆపర్లు దక్కకపోవడంతో చివరకు ఐటం సాంగ్ లకు సై అంటూ ఒప్పుకుంది. అప్పుడు ఆమె ఒప్పుకున్న ఆ ఒక్క ఐటం సాంగే ఇప్పుడు ఈమెను టాప్ లెవెల్ కి తీసుకెళ్లింది.

కేవలం టాలీవుడ్ లోనే కాదు... యావత్తు దక్షిణాది భారతచిత్రపరిశ్రమలోనే హంసానందిని టాప్ ఐటం గాళ్ గా ప్రేక్షకాభిమానుల నుంచి విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే... ఇంతవరకు ఈమె డాన్స్ చేసిన ప్రతి సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం! దీంతో ఈమెను తమ సినిమాల్లో ఐటంగాళ్ గా నటించాల్సిందేనంటూ దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దీనినే అదునుగా భావించిన ఈ భామ... భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందని చెబుతున్నారు. ఒక్కొక్క ఐటం సాంగ్ కు దాదాపు 50 లక్షలవరకు వసూలు చేస్తోందని చెప్పుకుంటున్నారు.

అయితే తాజాగా ఈ అమ్మడు తనకిష్టమైన హీరో కోసం కొంతవరకు రెమ్యునరేషన్ ని తగ్గించుకుందని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ముందుగా దర్శకనిర్మాతలు ఈమెను తమ సినిమాలో ఓ ఐటం సాంగ్ చేయాలని కోరుకుంటే.. దానికి జవాబుగా ఓకే అని చెప్పిన ఈ భామ... 50 లక్షలకంటే తక్కువ ఇస్తే రానని పట్టుపట్టిందట! దీంతో ఖంగుతిన్న సదరు నిర్మాత ఈమెతో ఎంతసేపటికీ బేరసారాలు ఆడినా ససెమిరా అంది. చివరకు అతను గోపీచంద్ మూవీ అని చెప్పగానే వెంటనే 10 లక్షల రూపాయల వరకు తన రెమ్యునరేషన్ తగ్గించేసిందట!

ఈ విషయంమీద మొదట హర్షం వ్యక్తం చేసిన నిర్మాత... తరువాత ఎందుకు తగ్గించావు అని ప్రశ్నిస్తే... దానికి ఆమె ‘‘నాకు గోపీచంద్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో ఐటం సాంగ్ చేయడం నా అదృష్టం’’ అని జవాబిచ్చిందని చెబుతున్నారు. ఆయనతో కలిసి హీరోయిన్ గా నటించాలనే కోరిక వుందని, అయితే ఇంతవరకు ఆ అవకాశం రాలేదని ఆమె మనసులోని భావాలను వ్యక్తం చేసిందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. అయితే హీరోయిన్ గా అవకాశం రాకపోయినా.. అతనితో కలిసి డాన్స్ చేస్తున్నందుకు నా అదృష్టం అని చెప్పుకుంటూ... ఏకంగా పదిలక్షల వరకు రెమ్యునరేషన్ ని తగ్గించేసిందని సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles