Tamanna wants to do love marriage

Tamanna wants to do love marriage, tamanna latest news, tamanna bhatia latest news, tamanna wants to do love marriage, tamanna opinion on love marriage, tamanna reveals her secret, tamanna bhatia hot photo shoot, tamanna hot photo shoot, tammana hot photos, tamanna love marriage

Tamanna wants to do love marriage

పెళ్లికిముందు ఆ బంధం తప్పనిసరి! తమన్నా

Posted: 07/12/2014 01:08 PM IST
Tamanna wants to do love marriage

(Image source from: Tamanna wants to do love marriage)

మిల్కీబ్యూటీ తమన్నా మరోసారి వార్తల్లోకెక్కింది. పెళ్లి విషయం మాట్లాడిన ఈ అమ్మడు... పెళ్లికి ముందు అన్ని కార్యక్రమాలు ముగించుకోవాలని వ్యాఖ్యలు చేస్తోంది. భార్యాభర్తలు సుఖంగా జీవితం కొనసాగించాలంటే... పెళ్లికిముందే అన్ని అనుభవాలను పంచుకోవాలని అందరికీ సూచనలిస్తోంది. పెళ్లికి ముందు ఆ బంధం లేకుంటే... జీవితాంతం సుఖంగా జీవించడం చాలా కష్టం అవుతుందనే తరహాలో తన మనసులోని మాటలను బయటపెట్టేసింది తమన్నా!

మిల్కీబ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా... అప్పట్లో టాలీవుడ్ లో ఓ ఊపు ఊపేసింది. ఆ తరువాత భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి, బాలీవుడ్ కి చెక్కేసింది. కానీ ఆమె అక్కడ నటించిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపులు కావడంతో తిరిగి టాలీవుడ్ చెంతకు చేరేందుకు ట్రిక్కులు ప్లే చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడికి మహేష్ బాబు సరసన ఆగడు సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ తరువాత కూడా అవకాశాలు వరిస్తాయో లేదో ఎవ్వరికీ తెలియదు.

ఇదిలావుండగా... తాజాగా ఈ అమ్మడు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసి, మరోసారి వార్తల్లోకెక్కింది. ఇన్నాళ్లవరకు పెళ్లి వ్యవహారం గురించి మాట్లాడితే... ఇప్పుడే పెళ్లేంటి..? నేనింకా పెళ్లి వయస్సుకు రాలేదు..? నా దృష్టంతా సినిమాల మీదే వుంది’’ అని సమాధానాలు ఇచ్చే ఈ అమ్మడు... ఇప్పుడు ఆ విషయంపై పెదవి విప్పింది. పెళ్లంటూ చేసుకుంటే లవ్ మ్యారేజే చేసుకుంటానని బల్లగుద్దిమరీ చెబుతోంది ఈ మిల్కీ బ్యూటీ! అయితే ప్రేమ పెళ్లి కూడా పెద్దల అంగీకారంతోనే చేసుకుంటానని చివరికి క్లారిటీ ఇచ్చుకుంది.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ గంపెడాశలతో చెక్కేసిన ఈ అమ్మడికి వరుసగా డిజాస్టర్స్ కావడంతోనే ఈ అమ్మడు ఈ విధంగా ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి మాట్లాడుతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరికొంతమంది బాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి ఇలా చెబుతోందని ప్రటకిస్తే... మరికొంతమంది మాత్రం ఈమె ఆల్రెడీ ఎవరినో ప్రేమిస్తోందని.. అందుకే ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుతోందని అనుకుంటున్నారు. ఎవరెన్ని రకాలుగా మాట్లాడుకున్నా... మొత్తానికి తమన్నా పెళ్లి సిద్ధంగా వున్నట్టు ఇన్ డైరెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles