Actress regina cassandra wants to work with star heroes

actress regina cassandra wants to work with star heroes, actress regina latest news, actress regina wants to work with star heroes, actress regina hot photo shoot, actress regina news, actress regina hot photo in movie, actress regina cassandra latest news, regina news, regina latest news, regina cassandra hot photo shoot

actress regina cassandra wants to work with star heroes

నన్ను సంతృప్తి పరిచే నాధుడే లేడా..?

Posted: 07/12/2014 12:16 PM IST
Actress regina cassandra wants to work with star heroes

(Image source from: actress regina cascandra wants to work with star heroes)

‘‘ఎస్ఎమ్ఎస్’’ సినిమా ద్వారా టాలీవుడ్ తెరకు పరిచయమైన రెజీనా... వరుస సినిమాలు చేసుకుంటూ చిన్ని సినిమాల అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో దాదాపు 15 చిన్న సినిమాల్లో ఈమె నటించింది. తాను నటించే సినిమాలలో హీరోల గురించి పట్టించుకోకుండా... తనదైన అద్భుత నటనను ప్రదర్శించే ప్రతిభ ఈమెకే సొంతం! అందులో ముఖ్యంగా ‘‘రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట’’ వంటి సినిమాలు ఈమెకు మంచి పేరును సంపాదించి పెట్టాయి.

ఒకవైపు తన టాలెంట్ ను నిరూపించుకుంటూ గ్లామర్ డోస్ ను కూడా భారీగా పెంచిపారేసింది. కొత్తజంట సినిమాలో హీరో చూపించిన మైనస్ పాయింట్లను కవర్ చేసుకుంటూ గ్లామరస్ గా కనిపించి, అందరినీ మైమరిపించింది. చాలావరకు ఈమె నటించిన సినిమాల్లో ఈమే నటనే చాలా బాగుంటుందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అలాగే ఈమెకు గ్లామర్ కూడా తోడవ్వడంతో దానిని సద్వినియోగం చేసుకుంటూ తన హాట్ అందాలను కూడా ప్రేక్షకులకు కనువిందు చేసింది.

ఈమె చూపించిన అందాలను అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో వున్న ప్రేక్షకజనాలతోపాటు దర్శకనిర్మాతలు కూడా ఫ్లాట్ అయిపోయారు. దాంతో ఈమెకు సినిమా అవకాశాలు ఒకటి తర్వాత ఒకటి వెంటాడి మరీ వచ్చాయి. దీంతో ఈ అమ్మడు కూడా అగ్రస్థానాన్ని సంపాదించుకోవచ్చుననే ఆశతో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ తన హాట్ అందాలను అందరి ముందు పరిచేసింది. ఇప్పుడు తాజాగా వచ్చిన ‘‘రారా కృష్ణయ్య’’ సినిమాలో అయితే లిప్ లాక్ తో అందరి మనసులను దోచుకుంది. కానీ ఆ సినిమా మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో ఈ అమ్మడు తన మనసులో వున్న ఆవేదనను బయటపెట్టినట్టు సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇంతవరకు తాను వరుసబెట్టి కేవలం చిన్ని సినిమాల్లో నటిస్తుండటం వల్లే తన టాలెంట్ మొత్తం వేస్ట్ అయిపోతోందని ఈ అమ్మడు తన మనసులో వున్న ఆవేదనని వ్యక్తం చేస్తున్నట్టు ప్రతిఒక్కరు చెప్పుకుంటున్నారు. పెద్ద సినిమాల్లో అవకాశం వస్తాయనే నమ్మకంతోనే వచ్చిన ప్రతి చిన్న సినిమా ఆఫర్ ను వదులుకోకుండా ఎంత ఎక్స్ పోజింగ్ ఇచ్చినా, మంచి నటనను ప్రదర్శించిన ఫలితం లేకపోయిందని ఆమె బాధపడుతున్నట్టు తెలుపుతున్నారు. ఎన్ని చిన్న సినిమాల్లో నటించినా... స్టార్ హీరోల సరసన నటించకపోవడంతో ఈమె అసంతృప్తిగా వుందని అంటున్నారు.

ఇంతవరకు ఈ అమ్మడికి పెద్ద సినిమాల నుంచి ఆహ్వానం అందలేదు. నటించిన ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను ప్రదర్శించిన రెజీనాకు... హీరోయిన్ గా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా వున్నప్పటికీ.. అదృష్టం ఈమెను వరించలేదు. అయితే రవితేజ ‘‘పవర్’’ సినిమాలో మాత్రం సెకండ్ హీరోయిన్ గా అవకాశం వచ్చింది. దీంతో కాస్త ఊరట చెందిన ఈ అమ్మడు... ఈ సినిమాతోనైనా స్టార్ హీరోల కంట పడొచ్చునని భావిస్తోందట! మరి ఈ అమ్మడికి ఈ సినిమా అయినా సంతృప్తి పరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles