Sunny leone says thanks mohan babu and manchu family

Sunny leone says thanks mohan babu and manchu family, sunny leone latest news, sunny leone hot news, sunny leone comments on mohan babu, sunny leone in current theega movie, sunny leone with manchu manoj, sunny leone with mohan babu, sunny leone tweet on mohan babu, sunny leone item song in current theega movie

Sunny leone says thanks mohan babu and manchu family

బాబు మంచులో కరిగిపోయిన సన్నీలియోన్

Posted: 07/12/2014 10:47 AM IST
Sunny leone says thanks mohan babu and manchu family

(Image source from: Sunny leone says thanks mohan babu and manchu family)

మంచు మనోజ్ హీరోగా ‘‘కరెంటు తీగ’’ సినిమాలో మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఇందులో భాగంగా ఆమె హైదరాబాద్ లో మంచు మనోజ్ తో కలిసి ఒక ఐటమ్ సాంగ్, కొన్ని సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకుని తిరిగి ముంబైకి వెళ్లిపోయింది కూడా! అక్కడికి వెళ్లిన తరువాత షూటింగ్ నేపథ్యంలో తనతో జరిగిన కొన్ని సంఘటనల గురించి గుర్తు చేసుకుంటూ ట్విటర్ లో పోస్ట్ చేసుకుంది. ఈమేరకు ఆమె బాబు మంచులో కరిగిపోయినందుకు నాకు చాలా సంతోషంగా వుందంటూ కామెంట్లు చేసింది.

‘‘కరెంటు తీగ’’ సినిమా షూటింగ్ సందర్భంలో సన్నీలియోన్ చేసిన పనితీరు, ఆమె సహకరించిన విధానానికి యూనిట్ సభ్యులు ఆమెకు అభినందనలను తెలుపుకున్నారు. ముఖ్యంగా మంచు కుటుంబంవారికి ఈమె అందించిన సేవలు తెగ నచ్చేసిందట! దీంతో మంచువారు సన్నీకి బహుమానంగా ఆమెను, ఆమె భర్తను ‘‘కరెంటు తీగ’’ సెట్ లో ఘనంగా సన్మానించారు. అందరి సమక్షంలో వీరికి దండలు తొడిగించి, చిత్రంలో ఆమె సహకరించిన తీరుకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మంచువారు ఇచ్చిన మర్యాదలకు సన్నీలియోన్ కరిగిపోయి, ధన్యవాదాలు తెలుపుకుంది.

‘‘నాకు ఇటువంటి సన్మానం ఎప్పుడూ జరగలేదని, ఎవ్వరూ నన్ను ఇంతలా అభిమానించలేదని’’ ఆమె సెట్ లోనే ఆనందభాష్పాలు పెట్టుకుంది! ముంబైకి వెళ్లిన తరువాత కూడా మంచువారు ఆమెకు ఇచ్చిన మర్యాదల గురించి అందరితో పంచుకుంది. ఈ మేరకు ఆమె ట్విటర్ లో మోహన్ బాబు చేసిన సన్నానం గురించి ప్రస్తావిస్తూ... కృతజ్ఞతలు తెలుపుకుంది. ‘‘మోహన్ బాబుకీ, మనోజ్ కి నా కృతజ్ఞతలు. వారితో కలిసి నటించడం నాకు మంచి అనుభూతి. కరెంటు తీగ చిత్ర బృందాన్ని నేను చాలా మిస్ అవుతున్నా’’ అని ట్వీట్ చేసింది.

మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘‘కరెంటు తీగ’’ సినిమాను జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సన్నీలియోన్ టీచర్ పాత్రలో, ఒక ఐటమ్ సాంగ్ లో నృత్యించనుంది. శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles