Sunny leone lungi dance with manchu manoj

Sunny Leone lungi dance with Manchu Manoj, Bollywood sexy star Sunny Leone, Sunny Lungi dance for Current Theega, Actress Sunny Leone lungi dance, Manchu Manoj Lungi dance, Current Theega Movie item song, manchu Lakshimi post item song pic

Sunny Leone lungi dance with Manchu Manoj

సన్నీది లీక్ చేసిన మంచు లక్ష్మి !

Posted: 07/11/2014 12:12 PM IST
Sunny leone lungi dance with manchu manoj

మంచు లక్ష్మి హీరోయిన్లతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవతుందనే టాక్ ఉంది. మంచు ఫ్యామిలీ హీరోలతో చేసే హీరోయిన్లతో ఏకంగా ఫ్రెండ్ షిప్ చేయడమే కాకుండా, వారు షూటింగులకు వచ్చినప్పుడు తన ఇంట్లోనే ఉంచుకొని వారికి రాచమర్యాదలు చేస్తుంది. గతంలో తాప్సీ మంచు లక్ష్మి ఆతిథ్యాన్ని స్వీకరించడమే కాకుండా ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయిపోయింది.

ఇప్పుడు బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ సన్నీలియోన్ కూడా మంచు లక్ష్మికి మంచి ఫ్రెండ్ అయ్యిందట. ఈమె మంచు మనోజ్ నటిస్తున్న ‘కరెంటు తీగ ’ సినిమాలో లేడీ టీచర్ పాత్ర పోషించినమే కాకుండా, మాంచి ఐటెం సాంగు కూడా ఒకటి వేస్తుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో హాట్ హాట్ బికినీ డాన్సులు వేసి అలరించిన సన్నీ ఇప్పుడు తెలుగులో లుంగీ కట్టి మాస్ డాన్స్ చేస్తోంది.

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ బృంద నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో మంచు మనోజ్ తో కలిసి సన్నీ కూడా లుంగీ కట్టుకొని చిందులేస్తున్నారు వీరిద్దరూ చిందులేస్తున్నప్పడు ఫోటో తీసి, దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసింది మంచు లక్ష్మీ. పైగా ఈ విషయం తాను చేసినట్లు ఎవరికి చెప్పకండే అంటూ కామెంట్ చేసింది. సన్నీతో కాస్తంత చనువుగా ఉంటూ ఆమె సినిమాకు సంబంధించిన విషయాలన్నీ లీక్ చేసేస్తుందని అంటున్నారు సినిమా జనాలు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles