Police boss no permision to rabhasa audio launch

Jr.NTR Rabhasa Audio postponed, Young tiger Rabhasa Audio postponed, Police boss no permision to Rabhasa Rabhasa Audio, NTR Rabhasa Movie, Rabhasa Audio Launch Telugu movie News

Police boss no permision to Rabhasa Audio

‘ రభస ’ ఆడియో పై పోలీసుల రభస !

Posted: 07/10/2014 10:38 AM IST
Police boss no permision to rabhasa audio launch

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ రభస ’ సినిమా  షూటింగులో చాలా రోజుల నుండి పాల్గొంటున్నా ఇంత వరకు ఈ సినిమా సంబంధించిన ఆడియో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ‘రామయ్యా వస్తావయ్యా ’ తరువాత ఎన్టీఆర్ సంబంధించిన సినిమా ఒక్కటి కూడా రాకపోవడంతో ‘రభస ’ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఆగష్టు 14వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు, ఈనెల 20 వ తేదీన ఆడియోను విడుదల చేస్తారని ప్రకటించడంతో ఆ రోజు కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రచారం ప్రకారం ఈ సినిమా ఆడియో విడుదల వాయిదా పడినట్లు సమాచారం. ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆడియో విడుదల పర్మిషన్ కొరకు సైబరాబాద్ కమిషన్ ని కలిస్తే జూలై 20 తేదీన ఆడియోను విడుదల చేయడానికి వీల్లేదని, గతంలో బాద్షా సినిమా ఆడియో టైంలో తొక్కిసలాట జరిగి అభిమాని చనిపోయిన విషయం గుర్తుకు చేశాడు.

ఇప్పుడు అలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు ఫోర్స్ ను ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వలేమని , రంజాన్ మాసం తరువాత ఈ సినిమా ఆడియోను విడుదల చేసుకోండని చెప్పడంతో ఈ ఆడియో విషయంలో సంగ్ధిద్దత ఏర్పడింది. మరి బెల్లంకొండ అనుకున్న తేదీకి విడుదల చేస్తాడో లేక సాధా సీదాగా గుట్టు చప్పుడు కాకుండా విడుదల చేస్తాడో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles