Tamanna talks about heroines lifes

Tamanna talks about heroines lifes, Tamanna talks about hero response, TAMANNA BHATIA INTERVIEW, Tamanna Talks about her Cinema Experience, Tamanna speaks about her upcoming movie

Tamanna talks about heroines lifes

అందరికి కలిపి ఒకేసారి వేసేస్తుంది

Posted: 07/09/2014 12:43 PM IST
Tamanna talks about heroines lifes

మొన్నటి వరకు కథ బాగుండాలి. రెమ్యునరేషన్ కూడా బాగుండాలి. అలా అయితేనే సినిమాలు చేస్తానంటూ కొండెక్కి కూర్చున్న తమన్నా ఇప్పుడు కొత్త హీరోయిన్ వలే చిత్రవిచిత్రమైన మాటలు మాట్లాడుతోంది. పాపం ఈ అమ్మడు అలాంటి పిల్లకాదట అని అనిపించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ అమ్మడు బాలీవుడ్ లో నటించిన ప్రతి చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ నుంచి మళ్లీ సౌత్ కు వచ్చే పనిలో పడింది. టాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోలను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. హీరోలను దర్శకులను పొగిడే కార్యక్రమం పెట్టుకుంది.

సినిమాల్లోని హీరోలతో మమల్ని పోల్చొద్దు. ఇద్దరి పరిస్థితులు వేరు. కథ, బడ్జెట్... ఇవన్నీ కథానాయకుడి ఇమేజ్ పై ఆధారపడి ఉంటాయి. ఓ సినిమాకు ఓపెన్సింగ్ వచ్చాయంటే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయితే కారణం ఖచ్చితంగా హీరోలే. ఒకవేళ ఓ సినిమా ఆడకపోతే ఆ ప్రభావం ఎక్కువగా హీరోపైనే పడుతుంది. ఆ తరువాత దర్శకుడు కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మా పరిస్థతి అలా కాదు. ఓ సినిమా ఆడకపోయినా కూడా మరో అవకాశం వస్తుంది. ఎన్ని సినిమాలు చేస్తున్నాం? ఏ హీరో పక్కన నటిస్తున్నాం? ఏ బ్యానర్లో పనిచేస్తున్నాం? ఇవే ముఖ్యమవుతాయి. వీటిని బట్టే కథానాయికలకు స్టార్ డమ్ పెరుగుతుంటుంది అని చెప్పుకొచ్చింది.

అంటే తమన్నా చెప్పినదాని బట్టి చూస్తే... బాలీవుడ్ ఈ అమ్మడు నటించిన అట్టర్ ఫ్లాప్ అవడానికి గల కారణం తాను కాదని చెప్పకనే చెబుతోంది. తనకు ఆ సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని, తాను కేవలం ఓ సాధారణ నటిని మాత్రమే అన్నట్లుగా చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడి మాటలకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles