Vv vinayak clarity on chiru 150 movie

vv vinayak clarity on chiru 150 movie, mega star chiranjeevi, chiranjeevi 150 movie, chiranjeevi movie, chiranjeevi political life, movie news

VV vinayak clarity on mega star chiranjeevi 150 movie

‘చిరు ’ 150వ సినిమా స్టోరీ అది కాదు

Posted: 07/08/2014 04:38 PM IST
Vv vinayak clarity on chiru 150 movie

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయ బిజీ షెడ్యూలు కారణంగా గత కొంత కొన్ని సంవత్సరాల నుండి వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి వల్ల కాస్తంత ఫ్రీ అయిన చిరు తన 150వ చిత్రానికి కసరత్తులు మొదలు పెట్టాడు. వాస్తవానికి చిరు 150 వ సినిమాలో నటిస్తానని ప్రకటించినప్పటి నుండి ఆ సినిమా పై రకరకాల వార్తలు మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. వాటన్నింటి పై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయిన వి.వి. వినాయక్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు విషయాల పై క్లారిటీ ఇచ్చాడు.

చిరంజీవి 150 సినిమా స్టోరీకి సంబంధించి కథ ఇంకా ఫైనల్ కాలేదని, ఇప్పటి వరకు చిరంజీవి చాలా కథలు విన్న మాట వాస్తమే అయినా వాటిలో ఏది ఫైనల్ కాలేదని, మీడియాలో వస్తున్నట్లు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ’ కథ మాత్రం కాదని, ఆయన 150 సినిమా రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం ఉండదని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం తాను అల్లుడు శీను చిత్రంలో బిజీగా ఉన్నానని, ఈ చిత్రం తరువాత చిరంజీవితో సమావేశమై కొత్త చిత్రం గురించి చర్చలు జరుపుతామని చెప్పారు. ఇప్పటికే అనేక సార్లు కలిసినప్పటికీ ఈ అంశంపై చర్చకు రాలేదని వినాయక్ చెప్పుకొచ్చారు.

దీనిని బట్టి చిరు 150వ సినిమాకు దర్శకుడ్ని నేనే అని చెప్పకనే చెప్పాడు వినాయక్. దాదాపు ఏడు సంవత్సరాల తరువాత చిరును వెండితెర పై చూడబోతున్నారు కాబట్టి ఆయన ఎలా ఉండబోతున్నాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొన్న మాట వాస్తమే కానీ ఆయన బొమ్మ ఒక్కసారి తెర పై కనిపిస్తే చాలు అంతా మరచిపోతారని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా పై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వెలువడుతుందో ఏమో ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles