Filmmaker bharathiraja to start up film school

filmmaker bharathiraja to start up film school, tamil filmmaker bharathiraja, bharathiraja film school, bharathiraja film school at chennai

filmmaker bharathiraja to start up film school

భారతీరాజా దర్శక పాఠాలు చెప్పబోతున్నాడు

Posted: 07/08/2014 12:46 PM IST
Filmmaker bharathiraja to start up film school

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ సూపర్ స్టార్ హీరోలకు ఆది గురువు భారతీ రాజా. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి వారినే కాకుండా చాలా మందిని హీరోలుగా మలిచి ఇండస్ట్రీకి ఆణిముత్యాల్లాంటి హీరోలను అందించిన భారతీ రాజా పేరు చెప్పగానే సీతాకోక చిలుక, పదహారేళ్ళ వయస్సు లాంటి సూపర్ హిట్ చిత్రాలు తీసి తానేంటో నిరూపించుకొని సంచలనం సృష్టించాడు.

అలాంటి లెజెండ్ దర్శకుడు ఇటీవలి కాలంలో దర్శకత్వంలో కాకుండా నటనలో టాలెంటును చూపిస్తూ తెర పై కనిపిస్తూ అలరిస్తున్న ఈయన తనకు సినీ కళామతల్లి ఇచ్చిన లైఫ్ కి ఏదో విధంగా సేవ చేయాలని తనలోని దర్శక ప్రతిభా పాటవాలను నలుగురికి నేర్పించడానికే తప్ప, నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి కాదని చెబుతూ... ఫిలిం స్కూల్ పెడుతున్నట్లు ప్రకటించాడు.

చెన్నైలో ఈ ఫిలిం స్కూల్ ని ఏర్పాటు చేయబోతున్నాడు. ఇప్పటికే చాలా మంది స్టూడియోలు, ఫిలిం స్కూల్స్ పెట్టి కాసులు సంపాదించుకుంటుంటే ఇంత టాలెంట్ ఉన్న దర్శకుడు నిస్వార్థంతో దర్శక పాఠాలు చెబుతానంటే ఆయన దగ్గర చేరని యువ శిష్యులు ఎవరు ఉంటారు చెప్పండి. భారతీ రాజా తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ ఆయన ఈ పాఠశాల నుండి వందల మంది నూతన దర్శకులు వెండితెర పైకి రావాలని కోరుకుందాం.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles