Kajal item song in geethanjali movie

kajal item song in geethanjali movie, Kajal agarwal turns item girl, Kajal agarwal in kona venkat movie,

kajal item song in geethanjali movie

గీతాంజలిలో ఐటెంగాళ్ గా...

Posted: 07/08/2014 10:32 AM IST
Kajal item song in geethanjali movie

ఇటీవలే అవకాశాలు రాక గాస్తంత గ్యాప్ తీసుకున్న కాజల్ అగర్వాల్ మళ్ళీ ఫాంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి కమీట్ అయిన ఈ అమ్మడు కెరీర్ మరింత స్పీడ్ అందుకోవడం కోసం ఐటెంగాళ్ అవతారం కూడా ఎత్తడానికి రెడీ అయిందని సమాచారం.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లు శృతి హాసన్, తమన్నా లాంటి వాళ్ళు ఐటెం సాంగులు వేసి మరింత క్రేజ్ సంపాదించుకోవడంతో ఇప్పుడు అదే బాటను కాజల్ కూడా ఎంచుకుందని సమాచారం. అంజలి ప్రధాన పాత్రధారిగా ప్రముఖ రచయిత కమ్ దర్శకుడు అయిన కోన వెంకట్ అండ్ కో ‘గీతాంజలి ’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటను ప్లాన్ చేసిన కోన తాజాగా ఆమెను వెళ్లి కలిశారట. ఆయన చెప్పిన పాటలో చిందేయడానికి ఈ ముద్దుగుమ్మ సంసిద్ధతను వ్యక్తం చేసిందని సమాచారం.

మొదట ఈ పాట కోసం కోన వెంకట్ చెల్లెలికి బెస్ట్ ఫ్రెండ్ అయిన సమంతాను అడిగిడే, ఆమె కోసం సమంతా కాదనలేదని ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కాజల్ పేరు తెర పైకి రావడంతో సమంతా చేయనని హ్యాండ్ ఇచ్చిందా ? లేక వేరే పాత్ర ఏదైనా చేస్తుందో తెలియదు కానీ, కాజల్ మాత్రం ఈ పాట కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందట.

దర్శక నిర్మాతలు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్తంత ఎక్కువ డిమాండ్ చేయడంతో ప్రస్తుతం ఇద్దరి మధ్య భేర సారాలు సాగుతున్నట్లు సమాచారం. కాజల్ అడిగినంత ఇచ్చుకొని అన్నీ ఓకే అయితే ఈమె కూడా ఐటెంగాళ్స్ లిస్టులోకి చేరిపోతుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles