Deepika padukone comments on katrina kaif

deepika padukone comments on katrina, deepika padukone, fhm sexiest 100, katrina kaif, priyanka chopra, ranbir kapoor, sonakshi sinha

deepika padukone comments on katrina kaif

కత్రినాను సూటిపోటి మాటలంటున్న దీపికా ?

Posted: 07/07/2014 04:05 PM IST
Deepika padukone comments on katrina kaif

నాలుగు జుట్లు కలిసి ఉంటాయి కానీ... రెండు శికెలు కలిసి ఉండవనే సామెత బాలీవుడ్ సినిమా హీరోయిన్లకు బాగా వర్తిస్తుంది. ఇటీవలే ప్రపంచ శృంగార తారగా ఎంపికైన దీపికా పదుకునే గతంలో రెండు సార్లు శృంగార తారగా ఎంపికైన కత్రినా పై సెటైర్లు వస్తోంది. తనకు కిరిటం దక్కడం పై ఎంతో గర్వపడుతున్నానని, సినిమా ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదని, నేను కూడా ఎప్పుడు ఇదే స్థాయిలో ఉంటానని అనుకోవడం లేదని వ్యాఖ్యానించింది.

ఇండస్ట్రీలో మీకు ప్రధాన పోటీ ఎవరని అడిగిన ప్రశ్న పై విధంగా స్పందించింది. ఈమె మాటలు కత్రినాను ఉద్దేశించే అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు సినీ జనాలు. గతంలో దీపికా బాలీవుడ్ అందగాడు అయిన రణబీర్ కపూర్ తో డేటింగ్ చేసింది. ఇఫ్పుడు రణబీర్ కత్రినాతో ఎఫైర్ నడిపిస్తున్నాడు. తన నుండి రణబీర్ దూరం చేసిన కత్రినా పై ఏ చిన్న అవకాశం దొరికినా దులిపేయాలని డిసైడ్ అయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు.  

అంతేకాదు కత్రినా కంటే గొప్ప అందగత్తెలు బాలీవుడ్ లో ఉన్నారని చెపుతూ తాను ఎవరి స్థాయిని సీరియస్ గా తీసుకోనని ఈ ఏడాది ఒక హీరోయిన్ హవా సాగితే వచ్చే ఏడాది మరో హీరోయిన్ హవా కొనసాగుతుందని వేసిన సెటైర్లు సూటిగా కత్రినాకే గుచ్చుకుంటాయని బాలీవుడ్ జనం అంటున్నారు. ఈ వ్యాఖ్యల పై కత్రినా ఎలా స్పందిస్తుందో ? ముందు ముందు వీరిద్దరి మధ్య మాటల యుద్దం ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles