Hero jagapathibabu birthday special story

hero jagapathibabu,hero jagapathibabu birthday, jagapathibabu special story, hero jagapathibabu movies, jagapathibabu latest pictures, peddarikam moive, antahpuram movie, gaayam movie, maavichiguru movie, subhakamkshalu movie, simha swapnam debue movie, lakshyam movie

hero jagapathibabu birthday special story

3.gif

Posted: 02/12/2013 11:26 AM IST
Hero jagapathibabu birthday special story

jagapathi-babu-nice-pice

       ఫ్యామిలీ హీరోగా తెలుగుచలన చిత్ర సీమలో తన స్థానం సుస్థిరం చేసుకున్న హీరో జగపతిబాబు పుట్టిన రోజు ఇవాళ. అసలుపేరు వీరమాచనేని జగపతి చౌదరి, ఫిబ్రవరి 12వ తేదీ 1962లో మచిలీపట్నంలో పుట్టాడు. తండ్రి ప్రముఖ నిర్మాత విబి రాజేంద్రప్రసాద్.  వైజాగ్ లో ఫర్నీచర్ షాప్ ను నిర్వహించే జగపతి బాబు.. తన స్నేహితుడైన నాగార్జునను స్పూర్తిగా తీసుకుని వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. హిందీలో హిట్ అయిన 'ఖత్రోంకే ఖిలాడి' చిత్రం రీమేక్ 'సింహ స్వప్నం' చిత్రంతో, సొంత బ్యానర్ అయిన 'జగపతి పిక్చర్స్' ద్వారా అరంగేట్రం చేశాడు. మొదటి సినిమాలోనే ఆయన ద్విపాత్రాభినయం అనే సాహసం చేసినప్పటికీ విజయం మాత్రం  కనికరించలేదు. ఆ తరువాత  చేసిన  సినిమాలు కూడా పరాజయాల బాటలోనే వెళుతున్న సమయంలో, 'పెద్దరికం' జగపతిబాబుకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో  కృష్ణ మోహన్ పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించాడు. ఈ సినిమా తరువాత ఆయన చేసిన 'గాయం' ... యాక్షన్ హీరోగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి, యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.
         ఇక ఆ తరువాత వచ్చిన 'శుభలగ్నం', 'మావిచిగురు', 'శుభాకాంక్షలు' వంటి చిత్రాలు జగపతిబాబును పూర్తి స్థాయి ఫ్యామిలీ హీరోను చేశాయి. ఇద్దరు కథానాయికల కథానాయకుడిగా శోభన్ బాబు తరహా పాత్రలను ఎక్కువగా చేసి మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన గెలుచుకున్నారు. ఈ సమయంలో ఆయన రొటీన్ కి భిన్నంగా చేసిన 'అంతఃపురం' చిత్రంలోని పాత్ర ఆయన నటనలోని పరిపక్వతకు అద్దం పట్టింది. అనంతరం 'పెదబాబు', లక్ష్యం', 'సామాన్యుడు' వంటి మరికొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి.
        ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నానని మీకు ఏ సినిమా చేసిన తర్వాత అయినా అనిపించిందా అని అడిగితే, కొన్ని సినిమాల విషయంలో అలా జరిగిందని  తన మనసులో మాట బయటపెట్టారు జగపతిబాబు. ఏ విషయాన్నైనా దాపరికంలేకుండా చెప్పగలిగే హీరో జగపతిబాబుకి తెలుగువిశేష్.కాం జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తోంది. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bandla ganesh to produce koratala siva next
Allu arjun naga chaitanya multistarer movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles