Aa aiduguru movie launch

Aa Aiduguru Movie, Aa Aiduguru Movie casting, film news, movie news, Aa Aiduguru Movie crew, Aa Aiduguru Movie film, dasari, Aa Aiduguru Movie posters, launch

Aa Aiduguru Movie launch

15.gif

Posted: 01/22/2013 06:24 PM IST
Aa aiduguru movie launch

55

       ప్రేమ్‌మూవీస్‌ పతాకంపై ప్రేమ్‌కుమార్‌ సమర్పణలో సరితపట్రా నిర్మిస్తున్న చిత్రం 'ఆ ఐదుగురు'. అన్నపూర్ణ స్టూడియోలో చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్‌ ఇవ్వగా, జిట్లా బాలకృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కె.కె. మహేందర్‌ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
         ఈ సందర్భంలో సద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ..  'ఆ నలుగురు'లో ఓ పెద్దాయన్ని హీరోగా చూపిస్తూ చేసిన ప్రయోగం. ఓ లావుపాటి కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ 'వినాయకుడు' తీయడం మరో ప్రయోగం. ఈ బేనర్‌ సాహసం గొప్పది. ఈ నిర్మాత గొప్పతనం వేరు. అందుకే ఓ పాట రచయితగా రాష్ట్ర ప్రభుత్వం నందితోసహా జాతీయ అవార్డు సైతం అందుకున్నా... ఈ సినిమాకు పాటలతోపాటు మాటలు కూడా రాయడానికి అంగీకరించాను. కేవలం బేనరు విలువ, దర్శకుడు అనిల్‌ రూపొందించిన కథ నన్నిలా ప్రేరేపించాయి'' అని సుద్దాల అశోక్‌తేజ అన్నారు.
           ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఆ నలుగురు, వినాయకుడు తీస్తున్నప్పుడు చాలామంది పెదవి విరిచారు. సక్సెస్‌ దానికి సమాధానం చెప్పింది. ఆ రెండింటిని మించిన గొప్ప ప్రయోగం ఇది. రెగ్యులర్‌ కథలకు దూరంగా తీస్తున్న చిత్రమిది. మామగారు..లో కోట, బాబూమోహన్‌ స్థాయికి మించిన పాత్రలో నేను నటిస్తున్నాను' అన్నారు.
          చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, చక్‌దే ఇండియా, రంగ్‌ దే బసంతి, వెడ్‌సన్‌డే తరహా చిత్రమిది. రాజకీయనేపథ్యం ఉంటూనే యువతను అలరించేలా సినిమా ఉంటుంది'' అన్నారు.
          సిద్దార్థ్‌ రాజ్‌కుమార్‌, వెంకట్‌, తనిష్క్‌, క్రాంతి, కృష్ణతేజ, శశికాంత్‌, అస్మితాసూద్‌ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: మంత్ర ఆనంద్‌, కెమెరా: పి.జి. విందా, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, కథ, కథనం, దర్శకత్వం:  అనిల్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rangam fame azmal movie news
Rai rai movie audio launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles