Gold prices fall on ease in trade war fears దిగివస్తున్న బంగారం ధరలు..అదేబాటలో వెండి

Gold prices today down rs 1000 from highs silver rates tumble

gold silver price today, gold, silver, gold price today, silver price today, gold per gram, silver price per gram, gold price per ounce, silver price per ounce, mcx silver price, mcx gold price, Bullion market

Gold and silver prices in India continued their slide today, tracking similar global trend. On MCX, October gold futures prices were down 1% today to ₹38,527 per 10 grams, off over ₹1,000 from all-time highs of ₹39,885 hit earlier this week.

గుడ్ న్యూస్: దిగివస్తున్న బంగారం ధరలు..అదేబాటలో వెండి

Posted: 09/06/2019 07:28 PM IST
Gold prices today down rs 1000 from highs silver rates tumble

బలహీనమైన అంతర్జాతీయ ట్రెండ్ కారణంగా దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 1 శాతం పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర రూ.38,527కు దిగొచ్చింది. గతవారంలో బంగారం ధర రూ.39,885కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అక్కడి నుంచి చూస్తూ ఇప్పుడు బంగారం ధర రూ.1,000 మేర పడిపోయింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి.

ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ఫ్యూచర్స్ ధర 3 శాతం క్షీణతతో రూ.48,065కు పడిపోయింది. ఇటీవలి గరిష్ట స్థాయి రూ.51,489తో పోలిస్తే వెండి ధర ఏకంగా రూ,3,500 పడిపోయింది. ఇండియన్ రూపాయి రికవరీ చెందడం, గ్లోబల్ మార్కెట్‌లో రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడటం వంటి అంశాలు ఇందుకు కారణం. ఇకపోతే ఢిల్లీలోని స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.372 క్షీణతతో రూ.39,278కు దిగొచ్చింది. ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోతూనే వస్తున్నాయి.

శుక్రవారం పసిడి ధర ఔన్స్‌కు 0.77 శాతం తగ్గుదలతో 1,513.95 డాలర్ల వద్ద కదలాడుతోంది. వెండి ధర కూడా ఔన్స్‌కు ఏకంగా 3.03 శాతం క్షీణతతో 18.23 డాలర్లకు క్షీణించింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక గణంకాల కారణంగా గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడిందని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. దీంతో బంగారం, వెండి ధరలపై ఒత్తిడి నెలకొందని తెలిపింది. అలాగే బంగారం, వెండి ధరలపై లాభాల స్వీకరణ కూడా ప్రతికూల ప్రభావం చూపిందని వివరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles