Tora Cabs launches ride-hailing service జీరో సర్జ్ తో మరో కొత్త క్యాబ్ సర్వీస్.. టోరా..

Tora cabs launches ride hailing service in hyderabad

Toracabs Technology Services,Tora Cabs,cab hiring,cab hiring technology platform,Hyderabad,Zero surge cab service,zero commission cab service

Zero surge, zero commission cab service aims to make it a transparent business model for both riders and drivers. Toracabs Technology Services has announced the launch of Tora Cabs, a technology platform for cab hiring starting with Hyderabad.

జీరో సర్జ్ తో హైదరాబాద్ లో మరో కొత్త క్యాబ్ సర్వీస్.. టోరా..

Posted: 08/26/2019 05:18 PM IST
Tora cabs launches ride hailing service in hyderabad

క్యాబ్ సర్వీసులు వినియోగించుకునే వారి సంఖ్య క్రమంగా నగరాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సేవలను అందించే ఓలా, ఊబర్ సంస్థలు కూడా బాగానే లాభాలను గడిస్తున్నాయి. ఈ తరుణంలో కస్లమర్లకు క్యాబ్ సేవలను అందించేందుకు మరో సంస్థ కూడా రంగంలోకి దిగింది. అదే టోరా క్యాబ్ సర్వీస్. ఒకేసారి ఏకంగా 10 వేలకు పైగా కార్లను రోడ్లపైకి తీసుకువస్తున్న ఈ సంస్థ.. కస్టమర్లను అకర్షించేందుకు కొత్త పథకాలను ఏమీ తీసుకురాలేదు. అయితే రూ. 45 బేస్‌ ఫేర్‌ పై 3 కిలోమీటర్లు ప్రయాణించే సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

అయితే ప్రస్తుతం క్యాబ్ సర్వీస్ సంస్థలు వసూలు చేస్తున్నట్లుగా డిమాండ్ ను బట్టి సర్ చార్జీలతో కస్టమర్ల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసే పద్దతికి తాము భిన్నమని.. చెబుతున్నారు టోరా క్యాబ్స్ సీఈవో (టెక్నాలజీ సర్వీసెస్‌ విభాగం) శ్రీనివాస్‌ కృష్ణ తెలిపారు. మార్కెటింగ్‌ డైరెక్టర్‌ కవితా భాస్కరన్‌ తో కలిసి టోరా యాప్‌ ను ఆవిష్కరించిన ఆయన, తాము కిలోమీటరుకు కనీస చార్జీగా రూ. 10 వసూలు చేయనున్నామని, తాము డిమాండ్ ను బట్టి సర్జ్ చార్జ్ ని వసూలు చేయబోమని స్పష్టం చేశారు.

ఇక ప్రస్తుతం మార్కెట్లో వున్న క్యాబ్ సర్వీస్ సంస్థలు డ్రైవర్ల నుంచి కమీషన్‌ వసూలు చేస్తున్నాయని.. ఆ విధానానికి కూడా తాము వ్యతిరేకమని.. చెప్పారు. అయితే కమీషన్ల బదులు డ్రైవర్లు తమకు రోజుకు రూ.199 చందా చెల్లిస్తే చాలని శ్రీనివాస్ కృష్ణ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సేవలను ప్రారంభించిన టోరా, సమీప భవిష్యత్తులో ఇతర నగరాలకు కూడా విస్తరిస్తుందని తెలిపారు. ట్రావెల్‌ టైమ్‌ చార్జీ కిలోమీటరుకు రూ. 1.52 అదనమని శ్రీనివాస్ కృష్ణ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles