Mukesh Ambani launches Jio Phone 3 జియో నుంచి అదిరిపోయే ఫిచర్లతో.. ఫోన్3

Reliance industries agm mukesh ambani launches jio phone 3

Reliance, Mukesh Ambani, jio phone3, jio gigafiber, jio phone 3 price, jio phone 3 launch date, jio, jio phone 3 unboxing, jio giga fiber, jio phone 3 camera, jio phone 3 specification, jio gigafiber plans, jio phone 3 booking, jio phone 3 launch

Reliance Industries Ltd (RIL) Chairman Mukesh Ambani had launched the much-awaited Jio GigaFiber and Jio Phone 3.

జియో నుంచి అదిరిపోయే ఫిచర్లతో.. ఫోన్3, ఆవిష్కరించిన అంబాని

Posted: 08/12/2019 06:29 PM IST
Reliance industries agm mukesh ambani launches jio phone 3

మొబైల్ వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఫోన్3ని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. ముంబైలో జరిగిన రిలయల్న్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ ఫోన్ ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ముంఖేష్ అంబానీ ప్రసంగిస్తూ.. జియో ఫోన్‌3ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

గతేడాది జరిగిన సర్వసభ్య సమావేశంలో రూ.2,999 ధరతో జియో ఫోన్‌2ని ఆవిష్కరించామని, ఈసారి మరో జియో ఫోన్ ని ఆవిష్కరిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ ప్రకటించారు. అదిరిపోయే ఫీచర్లతో వున్న ఈ నూతన అవిష్కరణ ధర రూ.4,500 ఉండొచ్చని తెలిపారు. మరికొద్ది రోజల్లోనే దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

జియో ఫోన్3 ప్రత్యేకతలివే..

4జీ స్మార్ట్‌ ఫీచర్లతో వస్తున్న జియో ఫోన్3ని మీడియా టెక్ చిప్‌సెట్‌తో తయారుచేశారు. గతంలో వచ్చిన జియో ఫోన్లకు క్వాల్కమ్, యూనిసాక్ చిప్‌సెట్‌లు వాడగా తాజా ఫోన్‌కు మాత్రం మీడియాటెక్ టెక్నాలజీ వాడారు. ఇది కాయ్(KAI) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జియో, జియో2 ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సాప్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. జియో3 ఫోన్‌లో వీటన్నింటినీ అప్‌డేట్ చేయడమే కాకుండా మరికొన్ని కొత్త ఫీచర్లు కూడా అందించనున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance  Mukesh Ambani  jio phone3  jio gigafiber  technology  e-commerce  business  

Other Articles

Today on Telugu Wishesh