ArcelorMittal wins majority stake in Essar Steel అర్సెలార్ మిట్టల్ చేతకి ఎస్సార్ స్టీల్..

Arcelormittal chosen successful applicant by essar steel lenders

ArcelorMittal, essar steel, Essar Steel resolution process, Essar Steel promoters, Committee of Creditors, Letter of Intent (LoI), "successful applicant", technology, business

The Essar Steel Committee of Creditors today picked ArcelorMittal as the highest bidder under the IBC. The CoC will now begin negotiations with ArcelorMittal .

దిగ్గజ అర్సెలార్ మిట్టల్ చేతికి దేశీయ ఎస్సార్ స్టీల్..

Posted: 10/26/2018 08:52 PM IST
Arcelormittal chosen successful applicant by essar steel lenders

ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్‌ మిత్తల్‌.. ఎస్సార్‌ స్టీల్ ను సొంతం చేసుకుంది. దేశీయంగా ఒక ఉక్క పరిశ్రమను సొంతం చేసుకోవాలన్న కల దీంతో తీరిందని లక్ష్మీ మిత్తల్‌ యాజమాన్యంలోని ఆర్సెలార్‌ మిట్టల్‌ పేర్కోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎస్సార్ స్టీన్ సంస్థను అర్సెలార్ మిట్టల్ రూ.42,000 కోట్లకు దక్కించుకున్నారు. ఎస్సార్‌ స్టీల్ కు రుణాలు అందించిన బ్యాంకుల రుణదాతల కమిటీ ఈ మేరకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను ఆర్సెలార్‌ మిత్తల్‌ కు అందించింది.

ఒకసారి దివాలా పరిష్కార ప్రక్రియకు సీఓసీ తుది ఆమోదం తెలిపి దాన్ని అమలులోకి తెస్తే... ఆర్సెలార్‌ మిత్తల్‌ తమ పెట్టుబడి, వృద్ధి ప్రణాళికలు ప్రకటించి కార్యరంగంలోకి దిగటమే తరువాయి. ఇందులో ఇప్పటికీ రూ.49,000కోట్లు చెల్లించని రుణాలు ఉన్నాయని మిత్తల్ తెలిపారు. కాగా ఈ మొత్తంలో దాదాపుగా 42 వేల కోట్ల రూపాయలను బ్యాంకు రుణాలు కాగా, మరో 8 వేల కోట్లు రూపాయలు సంస్థ పెట్టుబడుల రూపంలో పెట్టినవని తెలిపారు.

ఈ పెట్టుబడులలో సంస్థ అపరేషనల్ అభివృద్ది, ఉత్పాదక స్థాయిలను పెంచడంతో పాటు నిర్ధేశిత లాభాలను అందుకునే క్రమంలో బాగంగా పెట్టామని ఎస్సార్ సంస్థ రుణదాతల కమిటీ తెలిపింది. ఈ నెల 19న జరిగిన ఈ బిడింగ్ లో అప్పుడే అర్సెలార్ మిట్టల్ సంస్థకు రుణదాతలు లెటర్ అప్ ఇంటెంట్ కూడా ఇచ్చి వారే విజయవంతమైన అప్లికెంట్ గా తేల్చారు. ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు జరిగిన గట్టి పోటీని దృష్టిలో ఉంచుకుంటే అదేమీ అంత చవక డీల్‌ కాదని స్పష్టమవుతుంది. ప్రపంచంలోనే త్వరిత గతిన వృద్ధి నమోదవుతున్న మార్కెట్లలో భారత్‌ ఒకటి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles