RBI Hikes Repo Rate By 25 Basis Points రుణగ్రస్థులకు చేదువార్త.. రెపోరేటును పెంచిన అర్బీఐ

Rbi hikes repo rate by 25 basis points loan emis to be costlier

RBI, policy rates, key rates, Repo rate, interest rate, economy, monetary policy, Reserve Bank of India, Inflation, Monetary Policy Committee, business, economy

The Reserve bank of India’s (RBI’s) monetary policy committee (MPC) has raised repo rate by 25 basis points (bps) to 6.5 per cent, The bank has also raised inflation projection for the second half of the year to 4.8 per cent from 4.7 per cent in June.

రుణాలు పొందినవారికి చేదువార్త.. రెపోరేటును పెంచిన అర్బీఐ

Posted: 08/01/2018 05:08 PM IST
Rbi hikes repo rate by 25 basis points loan emis to be costlier

ఇల్లు, కారు సహా వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేందుకు భ్యాంకులను అశ్రయించి అవసరాల మేరకు రుణాలు తీసుకున్నవారికి, పొందాలనుకునే మధ్యతరగతి ప్రజలపై మరోమారు భారతీయ రిజర్వు బ్యాంకు చేధువార్తను అందించింది. కీలక వడ్డీ రేట్ల పెంపుతో బ్యాంకు రుణాలు మరింత భారం కానున్నాయి. ఇప్పటికే బ్యాంకు రుణాలు పోందినవారికి కూడా నెలసరి వాయిదాలు పెరగుతాయి. కీలక వడ్డీ రేట్లను అర్బీఐ పెంచిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచడంతో మధ్యతరగతి వర్గాలపై పెనుభారం పడనుంది. ఇక గత సమీక్షలో పావు శాతం పెరిగిన వడ్డీ రేట్లు.. మరోసారి కూడా పెరగడంతో మధ్యతరగతి వర్గాల నడ్డి విరిగింది.

ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్షలో భాగంగా వరుసగా రెండోసారి కీలక వడ్డీరేట్లను పెంచేసింది. జులై 30 నుంచి మూడు రోజుల పాటు జరిగిన సమీక్షా సమావేశంలో కీలక వడ్డీరేట్లను పావుశాతం మేర పెంచుతూ అర్బీఐ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం.. ప్రస్తుతం 6.25శాతంగా ఉన్న రెపో రేటు 6.50శాతానికి పెరిగింది. ఇక రివర్స్‌ రెపో రేటును కూడా 6 శాతం నుంచి 6.25శాతానికి పెంచారు. ఇక ఎంఎస్‌ఎఫ్‌ రేటు, బ్యాంకు రేటను 6.75శాతంగా వెల్లడించింది. ఈసారి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉండొచ్చని కొందరు అంచనా వేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.8శాతంగా నమోదు కావొచ్చని ఆర్బీఐ ఈ సమీక్షలో అంచనా వేసింది. మద్దతు ధరను పెంచడంతో ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని దీంతో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఈ ద్రవ్యోల్బణం 4.6శాతంగా నమోదవుతాయని అంచాన వేసింది. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటికి చిల్లర ద్రవ్యోల్బణం 5శాతానికి పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Repo Rate  Reserve Bank of India  Inflation  Monetary Policy Committee  business  economy  

Other Articles