Gold hits a year low వన్నె తగ్గిన పసిడి.. ఏడాది కనిష్టానికి బంగారం ధరలు..

Gold prices plunge to 1 year low low

gold prices, spot gold, US gold, US economy, Jerome Powell, Fed rate hike, silver, business

Gold prices held steady near a one-year low hit in the previous session, as the dollar firmed after Federal Reserve Chairman Jerome Powell's US economic outlook reinforced views the central bank is on track to steadily hike interest rates.

వన్నె తగ్గిన పసిడి.. ఏడాది కనిష్టానికి బంగారం ధరలు..

Posted: 07/18/2018 06:16 PM IST
Gold prices plunge to 1 year low low

బంగారం మళ్లీ కాంతుల్ని కోల్పోతుంది. కుందనం ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ పసిడి ధర ఐదున్నర నెలల కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్‌ క్షీణించడం.. అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వు త్వరలో వడ్డీ రేట్లను పెంచుతుందన్న ప్రకటన కూడా అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర ఇవాళ బులియన్‌ మార్కెట్ తగ్గముఖం పట్టింది. పది గ్రాముల బంగారం ధర 250 రూపాయలు తగ్గి, రూ.30,800గా నమోదైంది.

ఇదిలా వుండగా మరో వారం రోజల్లో పసిడి ధరలు మరింత తగ్గనున్నట్లు ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధర మరింతగా తగ్గి.. 29వేల 500 రూపాయలకు చేరుకుంటుందని అంచానాలు వేస్తున్నారు. ఇక సామాన్యుల ఆభరణ లోహంగా పేరోందిన వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కేజీ వెండి ధర ఇవాళ భారీగా తగ్గింది. ఏకంగా కిలో వెండి 620 రూపాయలు తగ్గి 40వేలకు కింద రూ.39,200గా నమోదైంది. వెండి కూడా పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ క్షీణించింది. గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.

దీంతో సెంటిమెంట్‌ బలహీనపడిందని బులియన్‌ ట్రేడర్లు పేర్కొన్నారు. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ తన వడ్డీరేట్లను కొనసాగింపుగా పెంచనున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో, ఈ విలువైన మెటల్‌కు డిమాండ్‌ తగ్గుతోంది. గ్లోబల్‌గా ఒక్క ఔన్స్‌కు బంగారం ధర 0.32 శాతం క్షీణించి 1,223.30 డాలర్లుగా నమోదైంది. వెండి కూడా 0.84 శాతం తగ్గి, 15.41 డాలర్లుగా ఉంది. ఇక దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 250 రూపాయల చొప్పున తగ్గి, రూ.30,800గా, రూ.30,650గా రికార్డయ్యాయి. నిన్న కూడా బంగారం ధరలు 100 రూపాయలు తగ్గాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold prices  spot gold  US gold  US economy  Jerome Powell  Fed rate hike  silver  business  

Other Articles