OPPO budget phone for Rs 10,990 దేశీయ విఫణిలోకి ఒప్పో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల

Oppo unveils budget phone for rs 10 990 in india

OPPO A3s, ColorOS 5.1, oppo, india, new delhi, chinese smartphone maker, oppo a3s, hotspot, e-commerce, smart phones, mobiles, technology, business

Chinese smartphone maker OPPO on Friday unveiled a new mid-range smartphone “OPPO A3s” for Rs 10,990 in India. The device houses 13+2MP dual rear camera system and an 8MP Artificial Intelligence (AI)-enabled front camera.

దేశీయ విఫణిలోకి ఒప్పో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల

Posted: 07/13/2018 05:47 PM IST
Oppo unveils budget phone for rs 10 990 in india

వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ తయారీ సంస్థలు పోటీపడి మరీ ఓ వైపు అత్యంత ఖరీధుతో కూడా నాణ్యతయుతమైన ఫోన్లను రూపొందిస్తూనే.. మరోవైపు సామాన్య ప్రజలకు అందుబాటులో వుండేలా బడ్జెట్ ఫోన్లను కూడా రూపోందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. దేశీయ విఫణిలోకి ఒప్పో ఏ3ఎస్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్‌లో ఒప్పో ఏ3ఎస్ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 10,990గా నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది.

సూపర్ ఫుల్ స్క్రీన్ ప్యానెల్, స్నాప్ డ్రాగన్ 450, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 32జీబీ స్టోరేజ్, డ్యూయల్ రియర్ కెమెరా, సెల్ఫీ కెమెరా, 19:9 రేషియో, రెడ్, డార్క్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 8.1, 6.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 13 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండ్ సెన్సార్ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్, సెల్ఫీ, 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, మైక్రో-యూఎస్బీ, 3.5 హెడ్‌ఫోన్ జాక్, 4230ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ కు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏప్రిల్ నెలలో ఒప్పో ఏ3 స్మార్ట్ ఫోన్ ను చైనాలో విడుదల చేసినట్లు కంపెనీ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : OPPO A3s  ColorOS 5.1  OPPO  e-commerce  smart phones  mobiles  technology  business  

Other Articles