Moto G6, Moto G6 Play launched in India భారతీయ విఫణిలోకి మోటో జీ6, జీ6 ప్లే.. ధరెంతో తెలుసా.?

Moto g6 moto g6 play launched in india price specifications and features

Motorola Moto G6, Motorola Moto G6 Plus, Moto G6 India, Moto G6 Plus India, Moto G6 India price, Moto G6 Play India price, lenovo, moto g6 specifications, moto g6 features, Moto G6 price, moto g6 play specifications, moto g6 play features, moto g6 play price, e-commerce, smart phones, mobiles, technology, business

Unveiled in Brazil in April alongside the higher-end Moto G6 Plus, the two smartphones are the latest mid-range effort in the Indian market by Lenovo-owned Motorola.

భారతీయ విఫణిలోకి మోటో జీ6, జీ6 ప్లే.. ధరెంతో తెలుసా.?

Posted: 06/04/2018 06:49 PM IST
Moto g6 moto g6 play launched in india price specifications and features

లెనోవో చేతికి మొటరోలా పగ్గాలు అందగానే ఇక మోటరోలా సంస్థ కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్త వేరియంట్లతో దూసుకుపోతుంది. అంతేకాదు ఎంతటి అద్భుత, అత్యాధునిక ఫీచర్ల ఫోన్ అయినా బడ్జెట్ ధరలకే అందిస్తుంది. ఈ క్రమంలో మోటొరోలాకు చెందిన మోటొ జి6, మోటొ జి6 ప్లే ఫోన్లను ఇవాళ లెనివో సంస్థ భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన మోటో జి5 సిరీస్ కు కొనసాగింపుగా ఈ ఫోన్లను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్లు మాత్రం బడ్జెట్ ధరలోనే అందుబాటులో వున్నాయి.

మోటో జి6 వెనుక గ్లాస్ తో కూడిన బాడీతో ప్రీమియం లుక్స్ తో ఉంటుంది. 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో, డిస్ ప్లేకు కార్నింగ్ గ్లాస్ గొరిల్లా ప్రొటెక్షన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1.8 గిగా హెర్జ్  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు ఉన్నాయి. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో రెండు రకాల వేరియంట్లు ఇందులో ఉన్నాయి. వెనుక భాగంలో 12 5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ఓఎస్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్ సీ యూఎస్బీ పోర్ట్ ను ఈ ఫోన్లో ఏర్పాటు చేయడం జరిగింది. వేగంగా చార్జ్ చేసుకునేందుకు గాను ఫోన్ తో పాటు 15వాట్స్ టర్బో చార్జర్ వస్తుంది. జి6 అమేజాన్ లో మాత్రమే విక్రయానికి ఉంటుంది. 3జీబీ ర్యామ్ ధర రూ.13,999. 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.15,999.

మోటో జి6ప్లే మోడల్ లో జి6 మాదిరిగానే 5.7 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. కాకపోతే రిజల్యూషన్ హెచ్ డీ మాత్రమే. 18:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. ఇది 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీతో ఉంటుంది. ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా, వెనుక 13 మెగాపిక్సల్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ ఓరియో 8.0 పై పనిచేస్తుంది. ఫోన్ తో 15 వాట్ టర్బో చార్జర్ వస్తుంది. జి6 ప్లే ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభిస్తుంది. ధర రూ.11,999. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే ఫ్లాట్ గా రూ.1,000 తగ్గింపును ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. అలాగే, నో కాస్ట్ ఈఎంఐ, తిరిగి ఫ్లిప్ కార్ట్ కే అమ్మితే రూ.5,100 చెల్లించే హామీలను కూడా ఇస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Moto G6  Moto G6 play  Lenovo  e-commerce  smart phones  mobiles  technology  business  

Other Articles