PNB Scam Accused Demand ED to Return India | పీఎన్బీ స్కామ్ లో నిందితుడు.. ఈడీని ఏం డిమాండ్ చేస్తున్నాడంటే...

Mehul choksi demand ed for returning to india

Mehul Choksi, Enforcement Directorate, PNB Scam, Rs 12,700 Crore Scam, Prevention of Money Laundering

Mehul Choksi, one of the key accused in the Rs 12,700 crore, has informed the Enforcement Directorate that he wishes to return to the country if his passport cancellation is revoked. The same was conveyed by ED to the Prevention of Money Laundering (PMLA) court on Thursday.

ఈడీకి మెహుల్ చోక్సీ డిమాండ్

Posted: 03/03/2018 11:10 AM IST
Mehul choksi demand ed for returning to india

దాదాపు 12, 700 కోట్ల స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ భారత్ వచ్చేందుకు తన డిమాండ్ ను వినిపిస్తున్నాడు. తన పాస్ పోర్టు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే తాను భారత్ కు వచ్చేందుకు సిద్ధమని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ కు తెలియజేశాడు. ఇదే విషయాన్ని కోర్టు ప్రివేన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కోర్టుకు గురువారం తెలియజేసింది.

మోహుల్ చోక్సీ గీతాంజలి జెమ్స్‌కి ప్రమోటర్‌. పీఎన్ బీ భారీ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్‌ మోదీ, మెహుల్‌ లు విదేశాలకు చెక్కేశారు. అనంతరం స్కాం వెలుగులోకి రావడం, భారత్‌లో వీరి సంస్థలపై దర్యాప్తు ఏజెన్సీలు దాడులు జరపడం, నీరవ్‌, మెహుల్‌ పాస్‌పోర్టులు రద్దవడం వంటివన్నీ జరిగాయి. అతనికి వ్యతిరేకంగా నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేయమని, ఈడీ కౌన్సిల్‌ హిటెన్‌ వెంగోకర్‌ కోరారు. చౌక్సి డిమాండ్‌ను తోసిపుచ్చిన వెంగోకర్‌, పాస్‌పోర్టు రద్దుపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సినవసరం లేదని, భారత్‌కు తిరిగి రావడానికి తాత్కాలిక ప్రయాణ అనుమతి చాలని పేర్కొన్నారు.

ఇదే ఆదేశాలను శుక్రవారం కోర్టు కూడా జారీచేయనుంది. అతని పేరుపై ఇప్పటికే మూడుసార్లు సమన్లు పంపినప్పటికీ, దర్యాప్తు సంస్థల ముందు అతను విచారణకు హాజరు కాలేదు. చౌక్సికి వ్యతిరేకంగా ఫిర్యాదు కూడా దాఖలైంది. పీఎన్‌బీ స్కాం నేపథ్యంలో మెహుల్‌ చౌక్సికి చెందిన 41 స్థిర ఆస్తులను ఈడీ సీజ్‌ చేసింది. అతనికి వ్యతిరేకంగా బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీచేసింది. భారత్‌లో భారీ కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పారిపోతున్న నీరవ్‌ మోదీ, మెహుల్‌ చౌక్సి, విజయ్‌ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లకు వ్యతిరేంగా ప్రభుత్వం ఓ కఠిన చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఫ్యుజిటివ్ ఎకనామిక్‌ అఫెండర్స్‌ బిల్లు పేరుతో దీన్ని పాస్‌ చేసింది. ఈ బిల్లు ద్వారా విదేశాలకు పారిపోయిన రుణ ఎగవేతదారుల బినామీ ఆస్తులపై చర్యలు తీసుకోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles